No mask: బైక్ లో భార్యతో మాజీ సైనికుడు, పట్టుకున్న పోలీసులు, రసీదు అడిగితే ఏం చేశారంటే?
బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో కష్టాలు ఏరూపంలో వస్తాయో తెలీక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 22 ఏళ్లు భారత సైన్యంలో సైనికుడిగా పని చేస్తున్న వ్యక్తిని పోలీసులు చితకబాదేశారు. భార్యతో కలిసి బైక్ లో వెలుతున్న మాజీ సైనికుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు ఫైన్ వేశారు. ఫైన్ కట్టిన మాజీ సైనికుడు రసీదు ఇవ్వాలని పోలీసులను అడిగాడు.
ఎందిరా ?, నువ్వు పోటుగాడివి అనుకుంటున్నావా ?, మమ్మల్నే రసీదు ఇవ్వాలని అడుగుతావా ? అంటూ అతని భార్య ముందే మాజీ సైనికుడిని చిల్లర దొంగను కొట్టినట్లు కొట్టారు. పోలీసుల చేతిలో తీవ్రగాయాలైన మాజీ సైనికుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. దేశం కోసం ప్రాణాలు లెక్కచెయ్యకుండా 22 ఏళ్లు ఉద్యోగం చేసిన మాజీ సైనికుడికి జరిగిన అవమానానికి మాజీ సైనికులతో పాటు ప్రజలు మండిపడుతున్నారు.

సైన్యంలో 22 ఏళ్లు ఉద్యోగం
కర్ణాటకలోని దావణగెరెలో నివాసం ఉంటున్న వీఎస్, వీరప్ప అనే యువకుడు 1996లో భారత సైన్యంలో ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి 2018 వరకు భారత సైన్యంలో పని చేస్తూ దేశం కోసం పని చేశాడు. 2018లో రిటైడ్ అయిన వీరప్ప దావణగెరె చేరుకుని భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.

మాస్క్ లేదని ఫైన్
వీరప్ప ఆయన భార్య బైక్ లో పని మీద బయటకు వెళ్లారు. దావణగెరె గ్రామీణ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ నింగనగౌడ, సాటి పోలీసులు రాత్రి 8 గంటల సమయంలో లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా రోడ్డు మీద నిలబడి వాహనాలు పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో అటు వైపు బైక్ లో వెళ్లిన వీరప్ప, ఆయన భార్యు పోలీసులు అడ్డగించారు, మాజీ సైనికుడు వీరప్ప మాస్క్ పెట్టుకోకపోవడంతో ఫైన్ కట్టాలని పోలీసులు చెప్పారు.

రసీదు ఇవ్వండి సార్.... ఏందిరా ? నువ్వు పోటుగాడివా?
మాస్క్ లేకపోవడంతో మాజీ సైనికుడు వీరప్ప పోలీసులు అడిగిన మొత్తం ఫైన్ కట్టాడు. సరే నువ్వు వెళ్లిపో అని పోలీసులు చెప్పారు. సార్ నా దగ్గర ఫైన్ కట్టించుకున్నారు. అందుకు రసీదు ఇవ్వాలని మాజీ సైనికుడు వీరప్ప పోలీసులకు చెప్పాడు. ఏందిరా, నువ్వు ఏమైనా పోటుగాడివా ?, మమ్మల్నే రసీదు అడుగుతావా ?, మర్యాదగా వెళ్లిపో, లేదంటే మక్కిలు విరగదీస్తామని పోలీసులు మాజీ సైనికుడు వీరప్పకు వార్నింగ్ ఇచ్చారు.

నువ్వు ఇప్పుడు మాజీవిరా... ఏంపీకుతావు ? చితకబాదేశారు
రసీదు కావాలని పట్టుబట్టిన మాజీ సైనికుడిని నలుగురు కానిస్టేబుల్స్ పట్టుకుని అతన్ని బూతులు తిట్టి కిందపడేసి చితకబాదేశారు. అడ్డు వెళ్లిన వీరప్ప భార్యను సైతం పక్కకు నెట్టేశారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల చేతిలో వీరప్ప భుజానికి, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో దావణగెరెలోని చిగటీరి జిల్లా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.

కేసు లేదు... బొక్కా లేదు పోరా
మాజీ సైనికుడు వీరప్పకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న దావణగెరె జిల్లా మాజీ సైనికుల సంఘం మండిపడింది. వీరప్పకు న్యాయం చెయ్యాలని మాజీ సైనికుల సంఘం నాయకులు ఐజీని, దావణగెరె జిల్లా ఎస్పీ హనుమంతరాయప్పకు ఫిర్యాదు చెయ్యడానికి వెళితే వాళ్లు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు.
Recommended Video

ఇంత అరాచకమా ?...... కోర్టుకు పోతాం!
దావణగెరె పోలీసులు కానిస్టేబుల్స్ మీద కేసు నమోదు చెయ్యడానికి నిరాకరించడంతో వీరప్పతో పాటు మాజీ సైనికులు ఇప్పుడు కోర్టును ఆశ్రయిస్తున్నారు. మొత్తం మీద మాస్క్ పెట్టుకోలేదని ఫైన్ కట్టించుకున్న పోలీసులు రసీదు ఇవ్వకపోవడమే కాకుండా మాజీ సైనికుడిని చిల్లర దొంగను కొట్టినట్లు కొట్టడం కలకలం రేపింది. గతంలో కూడా కర్ణాటక పోలీసులు మాజీ సైనికుల మీద ఇలాగే ప్రవర్తించి నవ్వులపాలైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications