బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Omicron: కరోనా వైరస్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్, విద్యాసంస్థలు క్లోజ్, క్లూ ఇచ్చిన మంత్రి, ప్రభుత్వం ఆలోచించే నిర్ణయం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఇప్పటికే రెండుసార్లు విద్యాసంస్థలు మూతపడటం, తరువాత మళ్లీ ఆన్ లైన్, ఆఫ్ లైన్ క్లాసులు ప్రారంభం కావడం జరిగింది. కోవిడ్ 19 ఫస్ట్ వేవ్ సందర్బంగా సుదీర్ఘంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. కోవిడ్ 19 సెకండ్ వేవ్ సందర్బంగా మరోసారి విద్యాసంస్థలు మూతపడ్డాయి. కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న సందర్బంగా, కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఐటీ హబ్ బెంగళూరుతో సహ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ విద్యాసంస్థలు మూతపడే అవకాశం ఉందని ఆ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి చిన్న క్లూ ఇచ్చేశారు.

హాస్టల్స్ లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని, హాస్టల్స్ మూసేవేసే విషయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచిస్తోందని విద్యాశాఖ మంత్రి మరోసారి విద్యాసంస్థలు మూసి వేస్తామని చెప్పకనే చెప్పారు.

Illegal affair: నేను లేని టైమ్ లో ఎవరో వస్తున్నారు ?, కట్టుకున్నోడికి కాటన్ చీర, సీక్రేట్ గా సిల్క్ చీర!Illegal affair: నేను లేని టైమ్ లో ఎవరో వస్తున్నారు ?, కట్టుకున్నోడికి కాటన్ చీర, సీక్రేట్ గా సిల్క్ చీర!

వైరస్ అరాచకం

వైరస్ అరాచకం

కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి ఏరైంజ్ లో విరుచుకుపడిందో కొత్తగా చెప్పనవసరం లేదు ఇంగ్లీష్ పదాలు పలకడానికి కష్టం అని బావించిన వారికి కూడా కోవిడ్ 18, కరోనా వైరస్ అనే మాట తెలిసిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 99 శాతం మందికి కరోనా వైరస్ అనే పేరు నోటెడ్ అయిపోయిందంటే ఆ వైరస్ ఎంత అరాచకం చేసిందో అర్థం అవుతోంది.

కోవిడ్ దెబ్బతో విద్యాసంస్థలు బంద్

కోవిడ్ దెబ్బతో విద్యాసంస్థలు బంద్

కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో ఇప్పటికే రెండుసార్లు విద్యాసంస్థలు మూతపడటం, తరువాత మళ్లీ ఆన్ లైన్, ఆఫ్ లైన్ క్లాసులు ప్రారంభం కావడం జరిగింది. కోవిడ్ 19 ఫస్ట్ వేవ్ సందర్బంగా సుదీర్ఘంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. కోవిడ్ 19 సెకండ్ వేవ్ సందర్బంగా మరోసారి విద్యాసంస్థలు మూతపడ్డాయి.

ఒమిక్రాన్ పుణ్యం కట్టుకుంటుందా?

ఒమిక్రాన్ పుణ్యం కట్టుకుంటుందా?

కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న సందర్బంగా, కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఐటీ హబ్ బెంగళూరుతో సహ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ విద్యాసంస్థలు మూతపడే అవకాశం ఉందని ఆ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బిసి, నాగేష్ ప్రజలకు చిన్న క్లూ ఇచ్చేశారు.

హాస్టల్స్ తోనే సమస్యలు

హాస్టల్స్ తోనే సమస్యలు

ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టల్స్ లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని, హాస్టల్స్ మూసేవేసే విషయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచిస్తోందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బిసి, నాగేష్ మరోసారి విద్యాసంస్థలు మూసి వేస్తామని మీడియా ముందు చెప్పకనే చెప్పారు. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం అన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుందని బెంగళూరులోని విదానసౌధలో ఆ రాష్ట్ర విద్యశాఖా మంత్రి బిసి, నాగేష్ మీడియాకు చెప్పారు.

ప్రస్తుతానికి ఓకే..... కాని ఫిబ్రవరిలో?

ప్రస్తుతానికి ఓకే..... కాని ఫిబ్రవరిలో?

కరోనా వైరస్ ను అరికట్టడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ప్రస్తుతం వైరస్ అదుపులోనే ఉందని మంత్రి బిసి, నాగేష్ అన్నారు. అయితే ఫిబ్రవరిలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందని (ఒమిక్రాన్ ) నిపుణులు హెచ్చరిస్తున్నారని, అందుకే అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని కర్ణాటక విద్యశాఖా మంత్రి బిసి, నాగేష్ మీడియాకు చెప్పారు. ఒమిక్రాన్ వైరస్ నుంచి విద్యార్థులను పూర్తిగా కాపాడటం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి బిసి, నాగేష్ వివరించారు.

English summary
Omicron: We will close schools if covid-19 surge in Karnataka, Says Education M inister BC Nagesh in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X