Plan B: చోరీ చేసిన బైక్ ల్లో రూ. లక్షల విలువైన మొబైల్ ఫోన్లు ?. ధూమ్ నెంబర్ ?. కిలాడీలు స్కెచ్ లు!
బెంగళూరు: బెంగళూరు సిటీలో ప్రతిరోజు 24 గంటలు ఎక్కడో అక్కడ జనసంచారం ఉంటుంది. బెంగళూరుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు, సిటీలో నివాసం ఉంటున్న వారు రాత్రి పూట సంచరిస్తుంటారు. బెంగళూరులో విపరీతంగా మొబైల్ ఫోన్లు లాక్కొని వెళ్లిపోతున్నారని కేసులు నమోద అవుతున్నాయి. చోరీ చేసిన బైక్ లో తిరుగుతూ ధూమ్ సినిమా టైప్ లో చోరీలు చేస్తున్న నిందితులు అదే సినిమా టైప్ లో చిక్కిపోయారు.
బెంగళూరు పోలీసులు ఇలాంటి కేసులను సీరియస్ గా తీసుకుని రంగంలోకి దిగారు. కేవలం నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు ఏకంగా రూ. 32 లక్షల విలువైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది, అయితే నిందితులు చోరీ చేసిన బైక్ ల్లో తిరుగుతూ విలువైన మొబైల్ ఫోన్లు లాక్కొని పారిపోయారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు సిటీలో నివాసం ఉంటున్న తబ్రేజ్ ఖాన్, షబాజ్ ఖాన్, సజ్జాద్ ఖాన్ అనే నిందితులను అరెస్టు చేసి నిందితుల నుంచి రే. 32. 40 లక్షల విలువైన మొబైల్ ఫోన్లు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు సిటీ పోలీసులు తెలిపారు. గతంలో నిందితుల మీద అనేక చోరీ కేసులు నమోదు అయ్యాయని పోలీసు అధికారులు అంటున్నారు.
చోరీ చేసిన విలువైన మొబైల్ ఫోన్లు గుట్టు చప్పుడు కాకుండా విక్రయించి వచ్చిన డబ్బులతో నిందితులు జల్సా చేస్తున్నారని వెలుగు చూసింది. పోలీసులకు చిక్కకూడదని పక్కాప్లాన్ వేసిన నిందితులు బైక్ లు చోరీ చేసి అదే బైక్ ల్లో తిరుగూ మహిళలు, అమాయకుల దగ్గర విలువైన మొబైల్ ఫోన్లు లాక్కొని పారిపోతున్నారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications