PM: అయ్యా, 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే వలన ఎవరికి లాభం, ప్రధాని మోదీ టూర్ టైమ్ లో మాజీ సీఎం ఫైర్!

బెంగళూరు/మైసూరు: బెంగళూరు-మైసూరు 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మండ్యకు చేరుకున్నారు. ఇదే సందర్బంలో కొన్ని వేల కోట్ల రూపాయాల అభివృద్ది పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడానికి, శంకుస్థాపనలు చెయ్యడానికి కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

ఇలాంటి సమయంలో మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ హైవే ఎవరికి ఉపయోగం ?, ఇది కొందరికి ఏటీఎం అయిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్బంగా మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు-మైసూరు 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే

బెంగళూరు-మైసూరు 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే

బెంగళూరు-మైసూరు రహదారిలో ఇంతకాలం సంచరించిన ప్రజలు ట్రాఫిక్ జామ్ తో నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వందల కోట్ల రూపాయల ఖర్చు చేసిన కేంద్ర ప్రభుత్వం బెంగళూరు-మైసూరు మార్గంలో 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే రోడ్డును నిర్మించింది. బెంగళూరు-మైసూరు మార్గంలో 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవేని జాతికి అంకితం చెయ్యడానికి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ మండ్య చేరుకున్నారు.

 మండిపడిన మాజీ సీఎం కుమారస్వామి

మండిపడిన మాజీ సీఎం కుమారస్వామి

కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు-మైసూరు 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించడం వలన ఎవరికి ఉపయోగం ?, ఇది కొందరికి ఏటీఎం అయిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్బంగా మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రజలకు పైసా ఉపయోగం ఉందా?

ప్రజలకు పైసా ఉపయోగం ఉందా?

ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటన సందర్బంగా మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి వరుసపెట్టి ట్విట్లు చేశారు. బెంగళూరు- మైసూరు ఎక్స్ ప్రెస్ హై వలన రామనగర, చెన్నపట్టణ, శ్రీరంగపట్టణ, మద్దూరు, మండ్య ప్రజలకు పైసా ఉపయోగం ఉందా ? అనే వియషంలో బీజేపీ నాయకులు క్లారిటీ ఇవ్వాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. బెంగళూరు-మైసూరు 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించడం వలన కొందరికి మాత్రమే లాభం వచ్చింది. ఈ పనుల కారణంగా కొందరి జోబుల్లోకి ఏటీఎంలు వచ్చాయని కుమారస్వామి వ్యంగంగా ట్విట్ చేశారు.

కన్నడిగులకు నిరాశ మాత్రమే మిగిలింది

కన్నడిగులకు నిరాశ మాత్రమే మిగిలింది

ప్రజలకు ఉపయోగం లేని ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించడం వలన ఆ ప్రాంత ప్రజలకు ఏమీ లాభం లేదని కుమారస్వామి ఆరోపించారు. బెంగళూరు-మైసూరు మార్గంలో త్వరగా సంచరించే వారికి తప్పా ఈ రోడ్డు ఎవ్వరికి ఉపయోగం లేదని శ్రీరంగపట్టణం, మండ్య, మద్దూరు. రామనగర, చెన్నపట్టణ ప్రజలు గుర్తించాలని, కన్నడిగులకు కేంద్ర ప్రభుత్వం నిరాశ మాత్రం మిగిల్చిందని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్బంగా మాజీ సీఎం కుమారస్వామి వరుసపెట్టి ట్విట్లతో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+