బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Relax: జైలు నుంచి విడుదలైన జయలలిత మాజీ దత్తపుత్రుడు, ఈరోజే శశికళ అక్కడ ఎందుకు ?, లింక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మాజీ దత్త పుత్తుడు జైలు నుంచి విడుదలైనాడు. అక్రమాస్తుల కేసులో జైలుపాైన జయలలిత మాజీ వారసుడు ఈ రోజు జైలు నుంచి బయటకు రావడం, ఆయన అవతారం చూసిన కుటుంబ సభ్యులు కొంతసేపు షాక్ అయ్యారు. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ రోజు ఈ మహానుభావుడు జయలలితకు వారసుడిగా ఉండేవాడు. అయితే మధ్యలో దత్తత తీసుకున్న ఈయనగారిని జయలలిత తన్ని బయటకు తరిమేశారు. ఆధాయానికి మించిన అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళతో పాటు జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్ బెంగళూరు సెంట్రల్ జైలుకు వెళ్లారు. గత ఏడాది అపరాధరుసుం చెల్లించిన శశికళ అండ్ కోట జైలు నుంచి బయటకు వచ్చినా సుధాకరన్ మాత్రం నేను అపరాధరుసుం చెల్లించను అని చెప్పడంతో సంవత్సరం తరువాత ఇప్పుడు జైలు నుంచి ఓం భ్రీమ్ బ్రుష్ అంటూ బయటకు వచ్చాడు.

Illegal affair: ప్రియుడికి పాలు, పంచదార, భర్తకు బోర్ వాటర్, పెళ్లామ్ స్కెచ్ తో మైండ్ బ్లాక్ !Illegal affair: ప్రియుడికి పాలు, పంచదార, భర్తకు బోర్ వాటర్, పెళ్లామ్ స్కెచ్ తో మైండ్ బ్లాక్ !

ఆరోజు దత్తత తీసుకున్న జయలలిత

ఆరోజు దత్తత తీసుకున్న జయలలిత

గతంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, చిన్నమ్మ శశికళ కుటుంబ సభ్యులు అందరూ కలిసిమెలసి ఉండేవారు. ఆ సమయంలో శశికళ సమీప బంధువు వీఎన్. సుధాకరన్ ను దత్తత తీసుకున్న జయలలిత అతన్ని సొంత కొడుకులాగా చూసుకుంది. జయలలిత వారసుడిగా సుధాకరన్ అప్పట్లో వీరలెవల్లో పాటుపడ్డాడు.

సీన్ సిడేల్..... తన్నితరిమేసిన అమ్మ

సీన్ సిడేల్..... తన్నితరిమేసిన అమ్మ


సుధాకరన్ ను జయలలిత దత్తత తీసుకున్న తరువాత అతన్ని అడ్డం పెట్టుకున్న శశికళ కుటుంబ సభ్యులు రెచ్చిపోయా అక్రమంగా భారీ మొత్తంలో డబ్బులు సంపాధించడం మొదలుపెట్టారు. రానురాను వారి అక్రమాల గురించి జయలలితకు తెలిసింది. తరువాత అమ్మ జయలలిత ఆగ్రహం వ్యక్తం చేసి శశికళతో పాటు దత్తపుత్రుడు సుధాకరన్ ను మెడపెట్టి బయటకు గెంటేశారు. అప్పటి నుంచి శశికళతో పాటు దత్తపుత్రుడు సుధాకరన్, వారి కుటుంబ సభ్యులను జయలలిత పోయెస్ గార్డెన్ దరిదాపులకు కూడా రానివ్వలేదు.

అక్రమాస్తుల కేసులో ఒకేసారి జైలుకు

అక్రమాస్తుల కేసులో ఒకేసారి జైలుకు


జయలలిత అనారోగ్యంతో చనిపోయిన తరువాత శశికళ కుటుంబ సభ్యులకు బ్యాడ్ టైమ్ మొదలైయ్యింది. ఆధాయానికి మించిన అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళ, ఇళవరసితో పాటు జయలలిత మాజీ దత్తపుత్రుడికి కోర్టు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 కోట్ల జరిమాన విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో సంవత్సరం రోజులు జైలు శిక్ష అనుభవించాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది.

 జైలు నుంచి బయటకు వచ్చిన చిన్నమ్మ

జైలు నుంచి బయటకు వచ్చిన చిన్నమ్మ

శశికళ, ఇళవరసితో పాటు సుధాకరన్ ను బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి అందరూ అక్కడే శిక్ష అనుభవించారు. నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పూర్తి అయిన తరువాత శశికళ, ఇళవరసి అపరాధరుసుం చెల్లించి జైలు నుంచి బయటకు వచ్చేశారు.

జైలు నుంచి సుధాకరన్ కు విముక్తి

జైలు నుంచి సుధాకరన్ కు విముక్తి

తాను అపరాధరుసం చెల్లించలేనని చెప్పిన సుధాకరన్ అప్పటి నుంచి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.
సుధాకరన్ కు విధించిన శిక్షాకాలం పూర్తి కావడంతో శనివారం అతన్ని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి అతని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు బెంగళూరు చేరుకున్నారు. శనివారం బయటకు వచ్చిన సుధాకరన్ చాలా సన్నగా కనపడటంతో అతని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. జైలు జీవితం గడిపిన సమయంలో సుధాకరన్ అప్పట్లో అర్దరాత్రి పూట నిద్రలేచి ఓం బ్రీమ్... బ్రామ్ అంటూ మంత్రాలు చదివి సాటి ఖైదీలకు నిద్రలేకుండా చేశాడని అప్పట్లో వెలుగు చూసింది.

ఈ రోజే ఎందుకు ?

ఈ రోజే ఎందుకు ?

సుధాకరన్ జైలు నుంచి విడుదల అవుతున్న రోజే చిన్నమ్మ శశికళ చెన్నైలోని అమ్మ జయలిత సమాధి దగ్గరకు వెళ్లి పూజలు చేశారు. ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటున్న శశికళ జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్ జైలు నుంచి విడుదల అవుతున్న రోజు అమ్మ జయలలిత సమాధి దగ్గరకు ఎందుకు వెళ్లారు ? అని విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.

English summary
Relax: V.N. Sudhakaran released from Bengaluru prison with a lean appearance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X