Revenge: గుడి కాంప్లెక్స్ లోని ముస్లీం షాపులు ధ్వంసం, చెప్పినా అధికారులు ?, క్లైమాక్స్ లో పోలీసులు!
బెంగళూరు/ధారవాడ: హిజాబ్ విషయంలో రెండు వర్గాల మద్య మొదలైన వివాదం ఇప్పుడు అనేక విషయాల్లో గొడవలకు దారితీసింది. హిజాబ్ వివాదం జరుగుతున్న సమయంలో భజరంగ్ దళ్ కార్యకర్త కూడా హత్యకు గురికావడం మరో వివాదానికి కారణం అయ్యింది. హిందూ, ముస్లీం వర్గాల మద్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది.
హిందూ దేవాలయాలు, ఆలయాలు, ధార్మిక కేంద్రాలు, దేవాదాయ శాఖకు చెందిన భవనాల్లో ముస్లీం వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్నారని, వారి షాపులు వెంటనే ఖాళీ చేయించి ఆ షాపులు హిందువులకు కేటాయించాలని ఇప్పిటికే హిందూ సంఘ సంస్థలు ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అధికారులకు, దేవాయలం ట్రస్టీలకు వినతి పత్రాలు ఇచ్చినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందూ దేవాయలానికి చెందిన షాపు రూమ్ లో వ్యాపారం చేస్తున్న ముస్లీం వ్యక్తుల షాపులను కొందరు వ్యక్తులు ధ్వంసం చెయ్యడం కలకలం రేపింది.

హిజాబ్..... భజరంగ్ దళ్ కార్యకర్త హత్య
కర్ణాటకలో హిజాబ్ విషయంలో రెండు వర్గాల మద్య మొదలైన వివాదం ఇప్పుడు అనేక విషయాల్లో గొడవలకు దారితీసింది. హిజాబ్ వివాదం జరుగుతున్న సమయంలోనే శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా అనే యువకుడు హత్యకు గురికావడం మరో వివాదానికి కారణం అయ్యింది. ఈ రెండు విషయాలు కర్ణాటకను కుదిపేసింది.

హిందూ దేవాలయాల షాపులు
హిందూ, ముస్లీం వర్గాల మద్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది. కర్ణాటకలోని హిందూ దేవాలయాలు, ఆలయాలు, ధార్మిక కేంద్రాలు, దేవాదాయ శాఖకు చెందిన భవనాల్లో ముస్లీం వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్నారని, వారి షాపులు వెంటనే ఖాళీ చేయించి ఆ షాపులు హిందువులకు కేటాయించాలని ఇప్పిటికే హిందూ సంఘ సంస్థలు ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.

ఆంజనేయస్వామి ఆలయం షాపులు
అధికారులకు, దేవాయలం ట్రస్టీలకు వినతి పత్రాలు ఇచ్చినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కర్ణాటకలోని ధారవాడలోని ఆంజనేయస్వామి దేవాయలానికి చెందిన షాపు రూమ్ లో ముస్లీంలు వ్యాపారం చేస్తున్నారని, ముస్లీం వ్యక్తుల షాపులు ఖాళీ చేయించాలని వినతి పత్రం సమర్పించి 15 రోజులు అయినా అధికారులు పట్టించుకోలేదని స్థానికంగా నివాసం ఉ:టున్న శ్రీరామసేన కార్యక్తులు రగిలిపోయారు.

షాపులు ధ్వంసం
ధారవాడలోని ఆంజనేయస్వామి ఆలయంలో వ్యాపారం చేస్తున్న కొందరు ముస్లీంలకు చెందిన షాపులను కొందరు వ్యక్తులు ధ్వంసం చెయ్యడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులు శ్రీరామసేన కార్యకర్తలు నలుగురిని అరెస్టు చేశారు. నలుగురు ముస్లీంలకు చెందిన షాపులు ద్వంసం అయ్యాయని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ధారవాడ పోలీసు అధికారులు తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications