Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Revenge: రూ. కోట్ల రూపాయల ఆస్తి, తండ్రి మర్మాంగం ఛట్నీ చేసి చంపేసిన కొడుకు, తల్లికి మ్యాటర్ చెప్పి?!

బెంగళూరు: దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. ఐటీ హబ్ సిటీకి సమీపంలోనే కొన్ని ఎకరాల పొలం ఉండటంతో వ్యవసాయం చేసుకుంటూ దంపతులు జీవిస్తున్నారు. ఒక ఎకరా పొలం కొన్ని కోట్ల రూపాయల విలువ పలుకుతుండటంతో మన జీవితాలు ఇక సెటిల్ అయిపోతాయని దంపతులు అనుకున్నారు. దంపతుల కుమారుడు గాలికి తిరుగుతూ ఏదో ఒక సందర్బంలో అప్పుడప్పుడు వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. కోట్ల రూపాయల ఆస్తికి వారుసుడైన తండ్రి మీద అతని కొడుకు రగిలిపోయాడు. తండ్రి మార్మాంగం మీద దాడి చేసి చంపేసిన కొడుకు నేరుగా వెళ్లి అతని తల్లికి మ్యాటర్ చెప్పాడు.

పుట్టపర్తి సాయిబాబా ఆశ్రయం సమీపంలో?

పుట్టపర్తి సాయిబాబా ఆశ్రయం సమీపంలో?

బెంగళూరు సిటీలోని కాడుగోడి (పుట్టపర్తి సాయిబాబా ఆశ్రయం సమీపంలో) శివార్లలోని ఖాజి సోన్నేనహళ్లి లో చెన్న బసవరాజు (56) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చెన్న బసవరాజ్ అలియాస్ బసవరాజ్ కు నళినాక్షి అనే భార్య, రాకేష్ అనే కుమారుడు ఉన్నాడు. బసవరాజ్ నివాసం ఉంటున్న ఏరియా బెంగళూరు కార్పోరేష్ కు శివార్లలోనే ఉంటున్నది.

రూ. కోట్లు పలుకుతున్న భూమి

రూ. కోట్లు పలుకుతున్న భూమి

ఐటీ హబ్ బెంగళూరు సిటీకి సమీపంలో బసవరాజ్ కు మూడు ఎకరాలకు పైగా భూమి ఉంది. బసవరాజ్ అతని భూమిని విక్రయించకుండా అందులోనే చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. మూడు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న బసవరాజ్, నళినాక్షి దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు.

జీవితంలో సెటిల్ అయిపోతామని ధీమా

జీవితంలో సెటిల్ అయిపోతామని ధీమా

ఒక ఎకరా పొలం కొన్ని కోట్ల రూపాయల విలువ పలుకుతుండటంతో మన జీవితాలు ఇక సెటిల్ అయిపోతాయని బసవరాజ్, నళినాక్షి దంపతులు అనుకున్నారు. కొడుకు రాకేష్ కూడా ప్రయోజకుడు అయితే మనం సంతోషంగా ఉంటామని బసవరాజ్, నళినాక్షి దంపతులు ఇంతకాలం అనుకున్నారు.

జీవితంలో బాగుపడవని దండించిన తండ్రి

జీవితంలో బాగుపడవని దండించిన తండ్రి

పొలం దగ్గరకు వెళ్లి కూలీల దగ్గర పొలంకు నీళ్లు పట్టాలని బసవరాజ్ అతని కొడుక్కి చెప్పాడు. పొలం దగ్గరకు వెళ్లిన రాకేష్ కూలీలకు మాటవరుసకు ఏదో చెప్పి వెళ్లి మొబైల్ లో టైమ్ పాస్ చేస్తున్నాడు. ఆ సందర్బంలో పొలం దగ్గరకు వెళ్లిన బసవరాజ్ కొడుకు రాకేష్ చేసే చేష్టల చూసి విసిగిపోయాడని తెలిసింది.

తండ్రి మర్మాంగం ఛట్నీ చేసి హత్య

తండ్రి మర్మాంగం ఛట్నీ చేసి హత్య

నువ్వు జీవితంలో బాగుపడవు, నీ వలన అన్ని నష్టాలే, నీ వలన మన ఇంటికి ఒక్కరూపాయి కూడా ఉపయోగం లేదని బసవరాజ్ అతని కొడుకు రాకేష్ ను మందలించాడు. కోట్ల రూపాయల ఆస్తికి వారుసుడైన తన తండ్రి బసవరాజ్ మీద అతని కొడుకు రాకేష్ రగిలిపోయాడు. గడ్డపారా తీసుకుని తండ్రి బసవరాజ్ మార్మాంగం మీద దాడి చేసి చంపేసిన కొడుకు రాకేష్ నేరుగా వెళ్లి అతని తల్లి నళినాక్షికి మ్యాటర్ చెప్పాడు. తండ్రి బసవరాజ్ ను హత్య చేసిన రాకేష్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+