Sankranthi: సంక్రాంతి ఎద్దుల పోటీలు, ఏదో అనుకుంటే ఏదో జరిగింది, యువకుల ప్రాణాలతో ?, ఏం జరిగింది!
బెంగళూరు/శివమొగ్గ: సంక్రాంతి పండుగ సందర్బంగా ఎద్దుల బెదిరింపు సమయంలో తీవ్రగాయాలైన ఇద్దరు మరణించారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని కొనెగవల్లి గ్రామం, సొరబ తాలూకాలోని మల్లూరు గ్రామంలో చోటుచేసుకున్నాయి.మకర సంక్రాంతి పండుగలో భాగంగా శివమొగ్గ తాలూకా కొనెగవల్లి గ్రామంలో, సొరబ తాలూకా మల్లూరు గ్రామంలో ఎద్దుల పండుగ నిర్వహించారు.
కొనగవల్లిలో జరుగుతున్న ఎద్దుల కొట్లాట పోటీని చూసేందుకు వెళ్లిన ఎద్దులు కొమ్ములతో దాడి చెయ్యడంతో శివమొగ్గలోని అల్కోలా ప్రాంతంలో నివాసం ఉంటున్న లోకేష్ (32) అనే యువకుడు మృతి చెందాడని అధికారులు తెలిపారు. అదే సమయంలో 6 మందికి గాయాలు కావడంతో శివమొగ్గలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఎద్దులను బెదిరించడంలో గాయపడిన లోకేష్‌ను శివమొగ్గలోని మెగాన్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక సోమవారం మృతి చెందాడని పోలీసులు అన్నారు.

సొరబ తాలూకా అనవట్టి మల్లూరులోని హోరీ బహబ్బలో నివాసం ఉంటున్న రంగనాథ్ (24 అనే యువకుడు చికిత్స విఫలమై శివమొగ్గలోని మెగాన్ ఆసుపత్రిలో మరణించాడు. ఎద్దులు పొవడంతో మొదట రంగనాథ్ ను షికారిపురలో ఆస్పత్రిలో చేర్చించారు. తరువాత అక్కడ రంగనాథ్ కు కడుపులో కుట్లు వేసిన అనంతరం శివమొగ్గలోని మెగాన్ ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స ఫలించక సోమవారం రంగనాథ్ ఆస్పత్రిలో మృతి చెందాడని అధికారులు తెలిపారు. ఎద్దుల బెదిరింపులు, ఎద్దుల పోటీల్లో యువకులు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు ఎద్దుల పోటీల నిర్వహకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.
శివమొగ్గ జిల్లాలోని కొనెగవల్లి, మల్లూరు గ్రామాల్లో ఎద్దుల బెదిరింపుల పండుగ, ఎద్దుల పోటీలు నిర్వహించిన నిర్వాహకులపై కేసు నమోదు అయ్యింది. ఎద్దులను పట్టుకునే పోటీలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్వహకులు ఎద్దుల పోటీలు, ఎద్దుల బెదిరింపుల కార్యక్రమాలు ప్లాన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.
బుల్ క్యాచింగ్ పోటీలను అభిమానులను దూరం నుంచి చూసేందుకు అనుమతించాలి. దీంతోపాటు బుల్ రన్ ప్రాంతంలో బారికేడ్ ఏర్పాటు చేయాలి. ఈ భద్రతలను ఎద్దుల పోటీల నిర్వాహకులు పాటించలేదని ఫిర్యాదులు అందాయని, విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications