Couple: భార్య కాలేజ్ లో లెక్సరర్, విహారయాత్రకు వెళ్లి ఎంజాయ్, ఇంట్లో ఒకేసారి ?, రాత్రి ఏం జరిగింది!

బెంగళూరు/మంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు అపార్ట్ మెంట్ లో సంతోషంగా నివాసం ఉంటున్నారు. భర్త ఫ్రీలాన్సర్, భార్య కాలేజ్ లో లెక్చరర్. దంపతుల జీవితం చాలా సంతోషంగా సాగిపోతున్నది. ప్రతిరోజు ఎవరి పనులు వాళ్లు చూసుకుంటూ సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నారు. సాయంత్రం దంపతులు సినిమాలు, షికార్లు తిరుగుతున్నారు.

దంపతులు విహారయాత్రకు వెళ్లి వచ్చారు. భర్త ఇంటికి ఫోన్ చేసిన భార్య మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. కుటుంబ సభ్యులు వెళ్లి చూసే సరికి లేడీ లెక్చరర్ కూడా శవమై కనిపించింది. ఒకేసారి దంపతులు అపార్ట్ మెంట్ లో శవమై కనిపించడం కలకలం రేపింది.

అపార్ట్ మెంట్ లో కాపురం

అపార్ట్ మెంట్ లో కాపురం

కర్ణాటకలోని మంగళూరు సిటీలోని కనకండి పోలీస్ స్టేషన్ పరిధిలోని అపార్ట్ మెంట్ లో మల్లికార్జున (35), సౌమ్యా (34) దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న మల్లికార్జున్, సౌమ్యా దంపతులు మంగళూరులోని అపార్ట్ మెంట్ లో చాలా సంతోషంగా జీవిస్తున్నారు.

 భార్య కాలేజ్ లో లెక్చరర్

భార్య కాలేజ్ లో లెక్చరర్

మల్లికార్జున ఫ్రీలాన్సర్ వెబ్ డిజైనర్ గా పని చేస్తున్నాడు. మల్లికార్జున్ భార్య సౌమ్యా మంగళూరులోని ఐటీఐ కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నారు. మల్లికార్జున్, సౌమ్యా దంపతుల జీవితం చాలా సంతోషంగా సాగిపోతున్నది. ప్రతిరోజు ఎవరి పనులు వాళ్లు చూసుకుంటూ సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నారు.

విహారయాత్రకు వెళ్లి వచ్చిన దంపతులు

విహారయాత్రకు వెళ్లి వచ్చిన దంపతులు

మూడు రోజుల క్రితం మల్లికార్జున్, సౌమ్యా దంపతులు కొడగుకు విహారయాత్రకు వెళ్లారు. దంపతులు మాత్రమే కొడగుకు విహారయాత్రకు వెళ్లి ఎంజాయ్ చేశారని తెలిసింది. కొడగు పరిసర ప్రాంతాల్లో సంచరించిన మల్లికార్జున, సౌమ్యా దంపతులు ఆదివారం రాత్రి మంగళూరులోని వారి అపార్ట్ మెంట్ కు చేరుకున్నారు.

శవమై కనిపించిన దంపతులు

శవమై కనిపించిన దంపతులు

సోమవారం సౌమ్య భర్త ఇంటికి ఫోన్ చేసి మీ అబ్బాయి మల్లికార్జున్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. మల్లికార్జున కుటుంబ సభ్యులు వెళ్లి చూసే సరికి లేడీ లెక్చరర్ సౌమ్యా కూడా ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించింది. ఒకేసారి మల్లికార్జున, సౌమ్యా దంపతులు అపార్ట్ మెంట్ లో శవమై కనిపించడం కలకలం రేపింది.

కొడగులో ఏం జరిగింది?

కొడగులో ఏం జరిగింది?

మల్లికార్జున, సౌమ్యా దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు ? అనే విషయం కచ్చితంగా తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని మంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ఎన్. శశికుమార్ మీడియాకు చెప్పారు. కొడుగుకు విహారయాత్రకు వెళ్లిన సమయంలో దంపతుల మద్య ఏమైనా గొడవ జరిగిందా ? అని ఆరా తీస్తున్నామని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+