Girl: కాలేజ్ కు వెళ్లిన ఎల్ఎల్ బీ అమ్మాయి. కాలేజ్ 7వ అంతస్తు నుంచి కిందకు దూకి ?, ఏం జరిగింది ?
బెంగళూరు: లా కాలేజ్ లో చేరిన యువతి తాను లాయర్ కావాలని అనుకుంది. కూతురు లాయర్ అయితే చూడాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇదే సంవత్సరం యువతి కాలేజ్ అమ్మాయి లా కాలేజ్ లో చేరింది. ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్న యువతి ఆమె కుటుంబ సభ్యులతో బాగానే ఉంది. ఇదే అమ్మాయి కాలేజ్ లోని 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
బెంగళూరులో వాణి (23) అనే యువతి నివాసం ఉంటున్నది. బెంగళూరులోని వీవీ పురంలోని బెంగళూరు ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ లో వాణి ఎల్ఎల్ బీలో చేరింది. ప్రస్తుతం వాణి ఎల్ఎల్ బీ మొదటి సంవత్సరం చదువుతోంది. శనివారం కాలేజ్ కు వెళ్లి వచ్చిన వాణి ఆమె కుటుంబ సభ్యులతో సంతోషంగానే ఉంది.

ఆదివారం వాణి ఇంట్లోనే ఉంది. సోమవారం ఉదయం ఎప్పటిలాగే వాణి కాలేజ్ కు వెళ్లింది. ఆ సందర్బంలో వాణి కాలేజ్ లో ఆమె స్నేహితులతో మాట్లాడలేదని తెలిసింది. లాకాలేజ్ లోని 7వ అంతస్తు మీదకు వెళ్లిన వాణి ఒక్కసారిగా కిందకు దూకేసింది. 7 అంతస్తుల మీద నుంచి దూకడంతో వాణికి తీవ్రగాయాలైనాయి.,
వెంటనే వాణిని ఆసుపత్రికి తరలించారు. వాణిని బతికించడానికి వైద్యులు సాయంత్రం వరకు ప్రయత్నించారు. అయితే వాణి ప్రాణాలు పోయాయని బెంగళూరు పోలీసులు అన్నారు. వాణి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ? అనే విషయం దర్యాప్తు చేస్తున్నామని, ఆమె ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు. లా కాలేజ్ అమ్మాయి అదే కాలేజ్ లో ఆత్మహత్య చేసుకోవడంతో సాటి విద్యార్థులు హడలిపోయారు.












Click it and Unblock the Notifications