బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Shock: కుక్కను చంపడానికి తుపాకి, బుల్లెట్, తీగలాగితే డొంక కదిలింది, వేల కేజీల పేలుడు పదార్థాలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మంగళూరు: రౌడీలు, హఫ్తా వసూలు చేసే గ్యాంగ్ స్టర్ శిష్యులు ఉంటున్న నగరంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో పోలీసులు అధికారులు ఎప్పటి కప్పుడు.కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన రహదారిలో వీధి కుక్కలు వాటిపాటికి అవి తిరుగుతూ ఎవరైన ఆహారం పెడితే తింటున్నాయి. ఇలాంటి వీధిలో వీధి కుక్కను తుపాకితో కాల్చి చంపేశారు. గ్యాంగ్ స్టర్స్ కు చాపకింద నీరులా పని చేస్తున్న నగరంలో వీధి కుక్కతను తుపాకితో కాల్చి చంపడం కలకలం రేపింది. వీధి కుక్కను ఎవరు చంపి ఉంటారు ? అంటూ పోలీసులు తమైన శైలిలో విచారణ చేశారు. వీధి కుక్క శావానికి పోస్టుమార్టం చెయ్యడంతో ఆ కుక్క శరీరంలో పాయింట్ 0. 22 బుల్లెట్ చిక్కింది. కుక్కను కాల్చి చంపడానికి ఎవరు తుపాకి ఉపయోగించారు ?, 0. 22 బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ పోలీసులు ఆరా తీశారు. కుక్క హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వేల కేజీల విలువైప పేలుడు పదార్థాలు చిక్కడంతో ఆ నగరంలో కలకలం రేపింది. తీగ లాగితే డొంక కదిలింది అనే సామెత లాగా వేల కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Illegal affair: భర్తను వదిలేసి ప్రియుడితో ఎంజాయ్, ప్రియురాలికి మూడో ప్రియుడు, రెండో వాడు !Illegal affair: భర్తను వదిలేసి ప్రియుడితో ఎంజాయ్, ప్రియురాలికి మూడో ప్రియుడు, రెండో వాడు !

కుక్క హత్య తో కలకలం

కుక్క హత్య తో కలకలం

కర్ణాటకలోని మంగళూరులో సిటీలో రౌడీలు, హఫ్తా వసూలు చేసే గ్యాంగ్ స్టర్ శిష్యులు ఉంటున్న నగరంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో పోలీసులు అధికారులు ఎప్పటి కప్పుడు.కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మంగళూరులోని శివభాగ్ ప్రాంతంలోని ప్రధాన రహదారిలో వీధి కుక్కలు వాటిపాటికి అవి తిరుగుతూ ఎవరైన ఆహారం పెడితే తింటున్నాయి. ఇలాంటి సమయంలో వీధి కుక్కను తుపాకితో కాల్చి చంపడం కలకలం రేపింది.

కుక్కను చంపడానికి తుపాకి

కుక్కను చంపడానికి తుపాకి

గ్యాంగ్ స్టర్స్ కు చాపకింద నీరులా పని చేస్తున్న మంగళూరు నగరంలో వీధి కుక్కతను తుపాకితో కాల్చి చంపడం కలకలం రేపింది. వీధి కుక్కను ఎవరు చంపి ఉంటారు ? అంటూ పోలీసులు తమైన శైలిలో విచారణ చేశారు. వీధి కుక్క శావానికి పోస్టుమార్టం చెయ్యడంతో ఆ కుక్క శరీరంలో పాయింట్ 0.22 బుల్లెట్ చిక్కింది,

కుక్క హత్య కేసులో యువకుడు అరెస్టు

కుక్క హత్య కేసులో యువకుడు అరెస్టు

కుక్కను కాల్చి చంపడానికి తుపాకి ఎవరు ఉపయోగించారు ?, 0.22 బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ పోలీసులు ఆరా తీశారు. వీధి కుక్క హత్య కేసులో అనీల్ సోన్స్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నేను మంగళూరులోని ముడిపుకైరంగల ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆనంద గట్టి (50) అనే వ్యాపారి దగ్గర బుల్లెట్ కొనుగోలు చేశానని అనీల్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.

వేల కేజీల పేలుడు పదార్థాలు సీజ్

వేల కేజీల పేలుడు పదార్థాలు సీజ్

మంగళూరు సిటీ పోలీసులు ఆనంద గట్టిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పేలుడు పదార్థాల వ్యాపారం చేస్తున్న ఆనంద గట్టి అధికారుల కళ్లు కప్పి నిషేధిత పేలుడు పదార్థాలు విక్రయిస్తున్నాడని వెలుగు చూసింది. మంగళూరులోని అజీజుద్దీన్ రోడ్డులోని గాంధీ సెన్స్ భవనంలోని ఓ రూమ్ లో 400 కేజీల సల్ఫర్ పౌడర్ 260 కేజీల అల్యూమినియం పౌడర్, 22 ఎయిర్ పిస్టోల్స్, 30 కేజీల లీడ్ బాల్స్ 390 కేజీల పోటాషియం నైట్రేట్ తో పాటు వేల కేజీల పేలుడు పదార్థాలు సీజ్ చేశామని మంగళూరు పోలీసు అధికారులు అన్నారు.

తీగ లాగితే డొంక కదిలింది

తీగ లాగితే డొంక కదిలింది

ఆనంద్ గట్టికి ఈ పేలుడు పదార్థాలు విక్రయించడానికి అనుమతి లేదని, ఇతను ఎక్కడి నుంచి పేలుడు పదార్థాలు తీసుకు వచ్చాడు ?, ఎవరికి విక్రయించడానికి ప్రయత్నించాడు అని ఆరా తీస్తున్నామని మంగళూరు సిటీ పోలీసు అధికారులు చెప్పారు. మొత్తం మీద వీధి కుక్క హత్య కేసులో వేల కేజీల అక్రమ పేలుడు పదార్థాలు చిక్కడంతో మంగళూరు సిటీ ప్రజలు ఉలిక్కిపడ్డారు.

English summary
Shock: Huge Amount of explosives found in Mangaluru City in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X