బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sisters: ఐటీ హబ్ లో అరాచకం, రూ. లక్ష కోసం ఇంట్లో దూరి అక్కాచెల్లెలు బట్టలు చింపేసి ?, మీడియాలో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ఆనేకల్: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒకే వర్గానికి చెందిన రెండు కుటుంబాలు చాలా సంవత్సరాలుగా ఒకరి ఇళ్లకు ఒకరు వచ్చి వెలుతున్నారు. దూరపు బంధువులు అయిన రెండు కుటుంబాలు శుభకార్యాలలో కలుసుకుంటున్నారు. ఓ మహిళ ఆమె పిల్లల చదువు కోసం గత ఏడాది అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆమె వర్గానికి చెందిన వ్యక్తి దగ్గర రూ. 1 లక్ష అప్పు తీసుకుంది. రూ. లక్ష రూపాయలకు 30 శాతం వడ్డీ చెల్లించింది. ఇటీవల అప్పు ఇచ్చిన వ్యక్తి మా డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. ఇదే విషయంలో ఇరు వర్గాల మద్య గొడవ జరిగింది.

ఆ సమయంలో రుణం తీసుకున్న మహిళతో పాటు ఆమె సోదరి బట్టలు చింపేసి కర్రలతో దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. బాధిత యువతులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. బాధితులు మీడియా ముందుకు రావడంతో వివాదం పెద్దది అయ్యింది. బాధిత మహిళలకు న్యాయం చెయ్యలేదని పోలీసుల మీద స్థానికులు మండిపడటంతో తరువాత పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ హబ్ సమీపంలో ఈ అరాచకం జరగడం కలకలం రేపింది.

Illegal affair: భర్తకు కోట్లలో ఆస్తులు, భార్యకు ఓ ప్రియుడు, భర్త మర్మాంగం నలిపేసి భార్య డ్రామాలు, క్లైమాక్స్!Illegal affair: భర్తకు కోట్లలో ఆస్తులు, భార్యకు ఓ ప్రియుడు, భర్త మర్మాంగం నలిపేసి భార్య డ్రామాలు, క్లైమాక్స్!

ఒకే వర్గానికి చెందిన రెండు కుటుంబాలు

ఒకే వర్గానికి చెందిన రెండు కుటుంబాలు

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ఆనేకల్ తాలుకాలోని సర్జాపుర సమీపంలోని దోమ్మసంద్రలో సుబ్బారెడ్డి అనే ఆయన నివాసం ఉంటున్నారు. సుబ్బారెడ్డి కుమారులు శాంతిప్రియా, భానుప్రియా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇదే చోట రామక్రిష్ణారెడ్డి, ఇంద్రమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. రామక్రిష్ణారెడ్డి, సుబ్బారెడ్డి ఒకే వర్గానికి చెందిన వారు.

 పిల్లల చదువుల కోసం రూ. 1 లక్ష అప్పు చేసింది

పిల్లల చదువుల కోసం రూ. 1 లక్ష అప్పు చేసింది

దోమ్మసంద్ర ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒకే వర్గానికి చెందిన సుబ్బారెడ్డి, రామక్రిష్ణారెడ్డి కుటుంబాలు చాలా సంవత్సరాలుగా ఒకరి ఇళ్లకు ఒకరు వచ్చి వెలుతున్నారు. దూరపు బంధువులు అయిన రెండు కుటుంబాలు శుభకార్యాలలో కలుసుకుంటున్నారు. సుబ్బారెడ్డి కుమార్తె శాంతిప్రియా ఆమె పిల్లల చదువు కోసం గత ఏడాది అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రామక్రిష్ణారెడ్డి దగ్గర రూ. 1 లక్ష అప్పు తీసుకుంది.

నెలకు 30 శాతం వడ్డీ?

నెలకు 30 శాతం వడ్డీ?

అప్పు తీసుకున్న రూ. లక్ష రూపాయలకు శాంతిప్రియా 30 శాతం వడ్డీ అంటే ప్రతినెల రూ. 9 వేలు వడ్డీ చెల్లించింది. ఇటీవల అప్పు ఇచ్చిన రామక్రిష్ణారెడ్డి మా అసలు మొత్తం తిరిగి ఇచ్చేయాలని శాంతిప్రియాను డిమాండ్ చేశాడు. ప్రస్తుతం మాదగ్గర అంత డబ్బు లేదని, త్వరలో తిరిగి ఇచ్చేస్తామని శాంతిప్రియా రామక్రిష్ణారెడ్డికి చెప్పింది.

ఆస్తి అమ్మేయాలని డిమాండ్

ఆస్తి అమ్మేయాలని డిమాండ్

శాంతిప్రియా తండ్రి సుబ్బారెడ్డికి ఆ ప్రాంతంలో ఇండ్లు ఉన్నాయి. మీ ఇల్లు అమ్మి మా డబ్బులు మాకు ఇచ్చేయాలని శాంతిప్రియాను డిమాండ్ చేశారు. శాంతిప్రియా, ఆమె తండ్రి సుబ్బారెడ్డి ఇల్లు అమ్మడానికి సిద్దం అయ్యారని తెలిసింది. అయితే అనుకున్న రేటుకు ఎవ్వరు ఇల్లు కొనుక్కోవడానికి ముందుకురాకపోవడంతో అలస్యం కావడంతో రామక్రిష్ణారెడ్డికి, శాంతిప్రియాల మద్య గొడవ జరిగిందని సమాచారం.

బట్టలు చింపేసి కొట్టారని ఆరోపణలు

బట్టలు చింపేసి కొట్టారని ఆరోపణలు

ఇదే విషయంలో ఇరు వర్గాల మద్య గొడవ జరిగింది. ఆ సమయంలో రామక్రిష్ణారెడ్డి కుమారుడు సునీల్ రుణం తీసుకున్న శాంతిప్రియా ఇంటిలోకి వెళ్లి రాద్దాంతం చేశాడని స్థానికులు అంటున్నారు. ఆ సందర్బంలో సునీల్ తో పాటు అతని తల్లిదండ్రులు రామక్రిష్ణారెడ్డి, ఇంద్రమ్మ కలిసి శాంతిప్రియాతో పాటు ఆమె సోదరి భానుప్రియా బట్టలు చింపేసి కర్రలతో దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

బూతులు తిట్టిన పోలీసులు?

బూతులు తిట్టిన పోలీసులు?

బాధిత మహిళలు శాంతిప్రియా, భానుప్రియా వెళ్లి సర్జాపుర పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. సర్జాపుర పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రాఘవేంద్ర కేసు నమోదు చెయ్యడానికి నిరాకరించి మమ్మల్ని బూతులు తిట్టి మీరే రాజీ చేసుకోవాలని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపించేశారని శాంతిప్రియా, భానుప్రియా ఆరోపించారు.

మ్యాటర్ మీడియాలో వస్తే కేసు నమోదు చేసిన పోలీసులు

మ్యాటర్ మీడియాలో వస్తే కేసు నమోదు చేసిన పోలీసులు

బాధితులు శాంతిప్రియా, భానుప్రియా మీడియా ముందుకు వచ్చి వాళ్ల శరీరం మీద ఉన్న గాయాలు చూపించడంతో వివాదం పెద్దది అయ్యింది. బాధిత మహిళలు శాంతిప్రియా, భానుప్రియాకు న్యాయం చెయ్యలేదని పోలీసుల మీద దోమ్మసంద్రలోని స్థానికులు మండిపడ్డారు. విషయం పెద్దది కావడంతో తరువాత సర్జాపుర పోలీసులు శాంతిప్రియాను పోలీస్ స్టేషన్ కు పిలిపించుకుని కేసు నమోదు చేశారు. శాంతిప్రియా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పారు. ఐటీ హబ్ బెంగళూరుకు సమీపంలో ఈ అరాచకం జరగడం కలకలం రేపింది.

English summary
Sisters: Fatal assault on womens over not paying debt in Dommasandra near Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X