Missing: యూపీఎస్ సీ కోచింగ్ కు వెళ్లి ప్రియుడికి కోచింగ్ ఇచ్చిన భార్య, రెండో తప్పుతో భర్త ఏం చేశాడంటే?!
బెంగళూరు/ శిరాడిఘాట్: వ్యాపారం చేస్తున్న యువకుడికి అతని కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం చూశారు. పెళ్లి కూతురు 10 ఏళ్ల తక్కువ వయసు అని చెప్పి వ్యాపారిని మోసం చేసి పెళ్లి చేసుకుంది. దంపతులు హ్యాపీగా కాపురం చేశారు. భార్య యూపీఎస్సీ పరీక్షలు రాయడానికి కోచింగ్ తీసుకోవాలని ఢిల్లీ వెళ్లింది. కోచింగ్ కోసం వెళ్లిన భార్య ప్రియుడిని సెట్ చేసుకుని అతనికి కోచింగ్ ఇచ్చింది. కొంతకాలం తరువాత భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది.
ఇదే సందర్బంలో భార్య అసలు వయసు కూడా భర్తకు తెలిసిపోవడంతో అతను రగిలిపోయాడు. భార్యను నమ్మించి విహారయాత్రకు పిలుచుకునిన వెళ్లి మూడుసార్లు హత్య చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు. చివరికి భార్యను హత్య చేసి శవాన్ని లోయలోపడేసి వెళ్లిపోయాడు. అయితే నా భార్య కనపడటం లేదని భర్త స్వయంగా వెళ్లి కేసు పెట్టడంతో అక్కడ కథ అడ్డం తిరిగింది.

ఫేమస్ ఎలక్ట్రానిక్ కంపెనీ డీలర్
బీహార్ కు చెందిన పృధ్విరాజ్ (32) అనే యువకుడు 10 సంవత్సరాల క్రితమే బెంగళూరు చేరుకున్నాడు. మడివాళలోని మారుతినగర్ లో నివాసం ఉంటున్న పృధ్విరాజ్ కొన్ని ఎలక్ట్రానిక్ కంపెనీల వస్తుల డీలర్ గా వ్యాపారం చేస్తున్నాడు. జోరుగా వ్యాపారం చేస్తున్న పృధ్విరాజ్ కు పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు.

10 సంవత్సరాల తక్కువ వయసు చెప్పిన పెళ్లికూతురు
వ్యాపారం చేస్తున్న పృధ్విరాజ్ అతని కుటుంబ సభ్యులు బీహార్ లో పెళ్లి సంబంధం చూశారు. బీహార్ కు చెందిన జ్యోతికుమారి అలియాస్ జ్యోతి (38) అనే మహిళతో పృధ్విరాజ్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లి కూతురు జ్యోతి తనకు 28 సంవత్సరాలు అంటూ 10 ఏళ్లు తక్కువ వయసు అని చెప్పి వ్యాపారిని మోసం చేసి పెళ్లి చేసుకుంది.

ఢిల్లీలో కోచింగ్ కోసం వెళ్లి భార్య ఏం చేసిందంటే?
పృధ్విరాజ్, జ్యోతి దంపతులు బెంగళూరులోని మడివాళలోని మారుతినగర్ లో నివాసం ఉంటూ హ్యాపీగా కాపురం చేశారు. యూపీఎస్సీ పరీక్షలు రాయడానికి కోచింగ్ తీసుకోవాలని జ్యోతి ఢిల్లీ వెళ్లింది. కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లిన జ్యోతి ఆక్కడ ఓ ప్రియుడిని సెట్ చేసుకుని అతనికి ప్రేమ పాఠాలలో, రొమాన్స్ చెయ్యడంలో కోచింగ్ ఇచ్చింది.

భార్య మ్యాటర్ తెలిసి రగిలిపోయాడు
ఢిల్లీలో కోచింగ్ ముగించుకున్న జ్యోతి తరువాత బెంగళూరు వచ్చింది. బెంగళూరు వచ్చిన తరువాత కూడా జ్యోతి ఢిల్లీలో ఉంటున్న ప్రియుడికి ఫోన్లు చేస్తూ అతనితో చాటింగ్ చేస్తూ కాలం గడిపింది. కొంతకాలం తరువాత భార్య జ్యోతి అక్రమ సంబంధం విషయం ఆమె భర్త పృధ్విరాజ్ తెలిసిపోయింది. ఇదే సందర్బంలో జ్యోతి అసలు వయసు 38 అని పృధ్విరాజ్ తెలిసిపోవడంతో అతను రగిలిపోయాడు.

భార్యను చంపడానికి భలే స్కెచ్ వేశాడు
కొంతకాలం భార్య జ్యోతితో గొడపడిన పృధ్విరాజ్ ఆమెను ఎలాగైనా చంపేయాలని స్కెచ్ వేశాడు. కొత్త మొబైల్ ఫోన్, సిమ్ కార్డు తీసుకున్నాడు. బీహార్ కు చెందిన సమీర్ కుమార్ అనే వ్యక్తి కారు బుక్ చేసుకున్నాడు. భార్య జ్యోతిని నమ్మించి ఆమెను ఉడిపికి విహారయాత్రకు పిలుచుకుని వెళ్లాడు.

హోటల్ లో, సముద్రం ముంచి చంపేయాలని స్కెచ్
ఉడిపిలోని మాల్వే బీచ్ లో సముద్రంలో భార్య జ్యోతిని ముంచి చంపేయాలని స్కెచ్ వేశాడు, అయితే విపరీతమైన అలలు వస్తుండంతో పోలీసలు బీచ్ లోకి అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడ స్కెచ్ మిస్ అయ్యింది. లాడ్జ్ లోని రూమ్ లో చంపేయాలని అనుకున్నాడు. అయితే వీలు కాకపోవడంతో అక్కడా జ్యోతి బతికిపోయింది.

భార్యను చంపేసి శవం లోయలో విసిరేశాడు
ఇక లాభం లేదని, మరోసారి హత్య చేద్దామని అనుకున్న పృధ్విరాజ్ భార్యతో కలిసి బెంగళూరు బయలుదేరాడు. మార్గం మధ్యలో శిరాడీ ఘాట్ లో జ్యోతిని నమ్మించి కారులో నుంచి బయటకు పిలుచుకుని వెళ్లి స్నేహితుడు సమీర్ కుమార్ సహాయంతో ఆమె గొంతు బిగించి చంపేశాడు. మూడు రోజుల తరువాత నా భార్య జ్యోతి కనపడటం లేదని పృధ్విరాజ్ స్వయంగా వెళ్లి మడివాళ కేసు పెట్టడంతో అక్కడ కథ అడ్డం తిరిగింది. పోలీసులకు అనుమానం వచ్చి పృధ్విరాజ్ ను బెండ్ తీస్తే మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications