ఆశ్రమంలో జైన ముని కిడ్నాప్, హత్య, శవం ముక్కలుగా నరికేసి మాయం చేసి!
బెంగళూరు/బెళగావి: కర్ణాటకలోని బెళగావి జిల్లా చిక్కోడి తాలూకాలోని హిరేకోడి గ్రామంలోని ఆశ్రమయం నుండి అదృశ్యమైన హిరేకోడికి చెందిన ఆచార్య శ్రీ 108 కామకుమార్ నంది మహారాజు అనే జైన్ ముని దారుణ హత్యకు గురయ్యారు. గత 15 ఏళ్లుగా నందిపర్వత్ ఆశ్రమంలో నివసిస్తున్న కామకుమార్ నంది మహారాజ్ జూలై 6 నుంచి కనిపించకుండా పోయారు. ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చిన భక్తులు ఆయన కోసం వెతికారు. అయితే చివరికి జైన ముని హత్యకు గురైనారని వెలుగు చూసింది
జైన్ ముని కనిపించకుండా పోయారని ఆచార్య కామకుమారనంది ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు భీమప్ప ఉగారే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిక్కోడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో జైన ముని కామకుమార్ నంది మహరాజ్ హత్యకు గురైనట్లు వెలుగు చూసింది. జైన ముని కామకుమార నంది మహరాజ్ మృతదేహం కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

నిందితులు జైన మునిని చంపి ఆయన మృతదేహాన్ని ఎక్కడ పడవేశారనే విషయంలో స్పష్టమైన సమాచారాన్ని పోలీసులకు అందించడం లేదు. కటకబావి గ్రామంలో శవాన్ని ముక్కలు చేసి కటకబావిలో విసిరేశామని ఓ సారి, మరో సారి మృత దేహాన్ని గుడ్డలో చుట్టి నదిలో పడేశామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కటకబావి గ్రామంలో పోలీసులు శుక్రవారం అర్దరాత్రి వరకు తనిఖీలు చేపట్టారు.
జైన ముని కామకుమారానంది మృతదేహం కోసం శనివారం ఉదయం 6.30 గంటల నుంచి అన్వేషణ కొనసాగనుంది. ఆశ్రమం నుంచి స్వామీజీయన్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. హిరేకోడి గ్రామంలోని నంది పర్వత ఆశ్రమంలో నిశ్శబ్దం వాతావరణం నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా హిరేకోడి గ్రామంలో పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
జూలై 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు జైనముని ఆశ్రమంలోని తన గదిలోనే ఉన్నారు, జూలై 6వ తేదీ ఉదయం వంట మనిషి ఆశ్రమానికి వచ్చినప్పుడు, జైనముని గదిలో లేరు. గత 15 సంవత్సరాలుగా నందిపర్వత ఆశ్రమంలో నివసించిన కామకుమార్ నంది మహారాజు కోసం జూలై 6వ తేదీన రోజంతా భక్తులు ఆశ్రమం చుట్టూ వెతికారు.
అనంతరం ఆచార్య కామకుమారనంది చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు భీమప్ప ఉగారే అదృశ్యంపై చిక్కోడి పోలీస్ స్టేషన్‌లో నిన్న ఫిర్యాదు చేయగా చిక్కోడి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సమయంలో జైన సాధువులను తామే హత్య చేశామని నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. జైన మునిని హత్య చేసి మృతదేహాలను ఎక్కడ పడవేశారో నిందితులు స్పష్టంగా చెప్పలేదని బెళగావి ఎస్పీ డాక్టర్ సంజీవ్ పాటిల్ అన్నారు.












Click it and Unblock the Notifications