మాజీ సీఎంకు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ హైకమాండ్, నేను ఏమైనా ?, నా సత్తా చూపిస్తా చూడండి!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ తరహాలో ప్రయోగాలు చెయ్యాలని బీజేపీ హైకమాండ్ బావిస్తోందని తెలిసింది. అయితే గుజరాత్ రాజకీయాలు వేరే, కర్ణాటక రాజకీయాలు వేరు అని బీజేపీ హైకమాండ్ గుర్తించలేకపోతుందని ఆరోపణలు ఉన్నాయి. సీనియర్లు అందరూ బీజేపీకి గుడ్ బాయ్ చెప్పడం మొదలుపెట్టడంతో కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.
నిన్న మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప, దావణగెరె సౌత్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్, కుందాపుర ఎమ్మెల్యే హాలడి శ్రీనివాస శెట్టి బీజేపీకి గుడ్ బై చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించారు. మంగళవారం కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి బాంబు పేల్చారు.

ఇప్పుడ అదే వరుసలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే జగదీష్ శెట్టర్ కూడా బీజేపీ హైకమాండ్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం హుబ్బళిలో విలేకరులతో మాట్లాడిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ఈ రోజు ఉదయం బీజేపీ హైకమాండ్ నాయకులు తనకు ఫోన్ చేసి నీ నియోజక వర్గంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని, ఈసారి నీకు సీటు ఇవ్వలేమని చెప్పారని అన్నారు.
హైకమాండ్ మాటలతో తాను షాక్ అయ్యానని, ఎవరా కొత్త వ్యక్తి ? అని నేను అడితే మా సర్వేలో మీరు ఓడిపోతారని వచ్చిందని, అందుకే మీకు సీటు ఇవ్వమని చెప్పారని జగదీష్ శెట్టర్ అన్నారు. తాను ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యాను. నా జీవితంలో ఓ చిన్న మచ్చకూడా లేకపోవడంతో ఒక్కసారి ముఖ్యమంత్రి కూడా అయ్యానని జగదీష్ శెట్టర్ గుర్తు చేశారు.
ఇంతకాలం నీతినిజాయితీగా తాను రాయల్ లా బతికానని, రాయల్ గానే రాజకీయ సన్యాసం చేస్తానని, అంతే కాని నేను ఓడిపోతానని ఎవరు చెబితే బీజేపీ హైకమాండ్ ఎలా నమ్ముతుందని జగదీష్ శెట్టర్ ప్రశ్నించారు. తనకు ఏ రాజకీయ నాయకుడి అండ. పార్టీ సింబల్ అవసరం లేదని, తన నియోజక వర్గం ప్రజల అండతో తాను భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని జగదీష్ శెట్టర్ ధీమా వ్యక్తం చేశారు.
30 ఏళ్లుగా పార్టీ కోసంతాను పని చేస్తున్నానని, జనపరివార్ కాలం నుంచి మా కుటుంబం బీజేపీతో ఉందని, ఈరోజు తాను కొత్తగా రాజకీయాల్లోకి రాలేదని, బీజేపీ హైకమాండ్ తనకు సీటు ఇవ్వకపోతే స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీ విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెడుతానని, ఇంకా 10 ఏళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో తాను ఉంటానని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదే విషయం గురించి తాను మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు ఇదే రోజు ఫోన్ చేసి మాట్లాడానని, మ్యాటర్ చెప్పానని, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, సమయం వచ్చినప్పుడు, నువ్వు నన్ను నేరుగా కలిసినప్పుడు మ్యాటర్ మొత్తం చెబుతానని యడియూరప్ప అన్నారని జగదీష్ శెట్టర్ మీడియాకు చెప్పారు.
మొత్తం మీద బీజేపీ హైకమాండ్ ఒక్కో సీనియర్ నాయకుడిని పక్కన పెడుతూ వస్తోందని, గుజరాత్ తరహాలో ఇక్కడి రాజకీయాలు లేవని, ఇక్కడి రాజకీయ నాయకులకు మైలేజీ ఎక్కువ అని, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచే సత్తా చాలా మందికి ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications