స్టార్ హీరో సుదీప్ కేసులో సైబర్ క్రైమ్ ఎంట్రీ, త్వరలో బయటకు వస్తుంది, ప్రతాప్ రెడ్డి ధీమా!

బెంగళూరు/న్యూఢిల్లీ: బహుబాష నటుడు, దర్శకుడు, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు బెదిరింపు లేఖలు పంపించిన వ్యక్తులను పట్టుకోవడానికి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసుల సహాయం తీసుకుంటున్నారని, నిందితులను త్వరలో పట్టుకుంటామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ సీహెచ్. ప్రతాప్ రెడ్డి అంటున్నారు.

కిచ్చా సుదీప్ కు బెదిరింపు లేఖలను పంపించిన నిందితులను పట్టుకునే కేసు బెంగళూరులోని పుట్టేనహళ్లి పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యింది. అయితే ఈ కేసును బెంగళూరు సీసీబీ పోలీసులకు అప్పగిస్తూ ఇటీవల బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ సీహెచ్. ప్రతాప్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు త్వరలో ఓ కొలిక్కి వస్తుందని ప్రతాప్ రెడ్డి అన్నారు.

The cyber crime police are cooperating in the investigation of star hero Kiccha Sudeeps case

ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తో కలిసి మీడియాతో మాట్లాడిన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇటీవల జేపీ నగర్ లోని తన ఇంటికి రెండు బెదిరింపు లేఖలు వచ్చాయని, ఆ లేఖలు పంపించిన వ్యక్తులు కన్నడ సినీ రంగానికి చెందిన వారిలో ఒకరని, వారి వెనుక ఎవరెవరు ఉన్నారో నాకు తెలుసు అని అన్నారు.

తన నగ్న వీడియోలు. పర్సనల్ వీడియోలు బయటపెడుతామని బెదిరిస్తున్నారని, అలాంటి బెదిరింపులకు తాను భయపడనని కిచ్చా సుదీప్ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సమక్షంలోనే అతన్ని బెదిరిస్తున్న వారికి ఘాటుగా సమాధానం చెప్పారు. కిచ్చా సుదీప్ కు బెదిరింపు లేఖలు బెంగళూరులోని దోమ్మలూరు పోస్టాఫీసు నుంచి వెళ్లాయని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.

దోమ్మలూరు పోస్టాఫీసులో కిచ్చా సుదీప్ ఇంటి అడ్రస్ కు ఎవ్వరు బెదిరింపు లేఖలు పోస్టు చేశారు ? అని అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో బెంగళూరు సీసీబీ పోలీసులకు సహకరించడానికి సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. కిచ్చా సుదీప్ కు బెదిరింపు లేఖలు పంపించిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+