ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న మంత్రి, కేసు పెట్టిన లేడీ లీడర్, కన్నడిగ, తమిళ్, తెలుగు మధ్య !

బెంగళూరు/చిత్తూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కేసులు పెట్టుకోవడం మొదలైయ్యింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు రెచ్చిపోతున్నారని, కన్నడ, తమిళ బాషల ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని, సమాజంలో శాంతికి భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రముఖ సినీ నిర్మాత, మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మీద లేడీ లేడీర్ కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు సిటీలోని రాజరాజేశ్వరి నగర ఎమ్మెల్యే, ప్రముఖ నిర్మాత, ప్రవాసాంధ్రుడు మునిరత్న ప్రస్తుతం కర్ణాటక మంత్రిగా పని చేస్తున్నారు. మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న మునిరత్న ఇటు రాజకీయాల్లో, వ్యాపారాల్లో, సినిమా రంగంలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన మునిరత్న తరువాత ఆపరేషన్ కమలలో భాగంగా ఆ పార్టీకి రాజీనామా చేసి 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడి నుంచి బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యి తరువాత మంత్రికూడా అయ్యారు.

The lady leader filed a case against the minister saying that he was creating conflict between Kannadigas and Tamil people.

రెండు రోజుల క్రితం బెంగళూరులోని జాలహళ్లిలోని ఖతానాగర్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి మునిరత్న తమిళ్ లో మాట్లాడారు. ఆ సందర్బంలో ఖాతానగర్ వార్డులోకి ఎవరైనా వచ్చి ఓట్లు అడిగితే తరిమితరిమి కొట్టండి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయులను ఉద్దేశించి మంత్రి మునిరత్న తమిళ్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అదే నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ మీద పోటీ చేస్తున్న కుసుమా హనుమంతప్ప ఆరోపించారు.

మంత్రి మునిరత్న ఆర్ఆర్ నగరలో కన్నడిగులు-తమిళ ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నారని, ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుసుమా హనుమంతప్ప బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంత్రి మునిరత్న ప్రజలను రెచ్చగొడుతున్న సమయంలో తీసిన వీడియో కూడా కుసుమా పోలీసులకు అందించారు. మంత్రి మునిరత్న మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+