ముస్లీం రిజర్వేషన్ల రద్దు, అమిత్ షా ఏం చెప్పారంటే ?, ఓటు బ్యాంక్ కాదు, పేదల కోసమే మిత్రమా !
బెంగళూరు/విధానసౌధ: కర్ణాటకలో ఓబీసీ కోటాలో 2B కోటా కింద ముస్లీంకు గతంలో కేటాయించిన 4 శాతం రిజర్వేషన్ ను ఆ రాష్ట్రంలోని బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం రద్దు చెయ్యడాన్ని కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా సమర్థించుకున్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలు చెయ్యడానికి ముస్లీం రిజర్వేషన్ రద్దును లేనిపోని రాద్దాంతం చేస్తోంది కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా మండిపడ్డారు.
కర్ణాటకలో ముస్లీంలకు కేటాయించిన 4 శాతం రిజర్వేషన్ ను రద్దు చేసిన బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం పేదలకు న్యాయం చెయ్యడానికి ఆ నాలుగు శాతం రిజర్వేషన్ ను ఉపయోగించడం నిజంగా అభినందిస్తున్నానని అమిత్ షా అన్నారు. బెంగళూరులోని విధాన సౌధ ఆవరణంలో బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ, బసవేశ్వరుడి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ముస్లీం రిజర్వేషన్ల రద్దుపై పై విధంగా స్పందించారు.

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాడప్రభు (బెంగళూరు నగర నిర్మాత) కెంపేగౌడ, బసవేశ్వర ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నామని, పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం మా ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. విధాన సౌధ ఆవరణంలో కెంపేగౌడ, బసవేశ్వరుడి విగ్రహాలను కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించిన తరువాత కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ మాట్లాడారు.
ఎన్నో ఏళ్ల క్రితమే విధాన సౌధ ఆవరణంలో కెంపేగౌడ, బసవేశ్వరుడి విగ్రహాలు ఆవిష్కరించవలసి ఉందని, అయితే చాలా ఆలస్యం అయ్యిందని, అయితే ఈ విషయంలో తాను ఎవ్వరినీ దూషించడం లేదని అంటూనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు చురకలు అంటించిన బసవరాజ్ బోమ్మయ్ బీజేపీ ప్రభుత్వ తీరును ఆకాశానికి ఎత్తేశారు.

ఒక్క నది కూడా లేని ప్రాంతంలో కెంపేగౌడ బెంగళూరు నగరాన్ని ఏర్పాటు చేసి అభివృద్ది చేశారని, ఈ రోజు ఐటీ హబ్ గా, సిలికాన్ సిటిగా బెంగళూరు ప్రపంచదేశాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుందని, ఈ ఘనత కెంపేగౌడదే అని సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. విధాన సౌధ ఆవరణంలో కెంపేగౌడ, బసవేశ్వరుడి విగ్రహాలు ఏర్పాటు చేశామని. ఎదురుగా హైకోర్టు కూడా ఉందని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. కెంపేగౌడ, బసవేశ్వరుడి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, కర్ణాటక మంత్రులు, బీజేపీ నాయకులు, కర్ణాటకలోని వివిద మఠాధిపతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications