మోదీని తిడితే మీకు మైలేజీ పెరుగుతుందా ?, దమ్ములేని నాయకులతో ఇదే?
బెంగళూరు/దావణగెరె: ప్రధాని నరేంద్ర మోదీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చెయ్యడంతో కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా మండిపడుతున్నారు. ప్రచంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారని, ఆయన పనితీరును ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయని కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచంలోని అన్ని దేశాల నాయకులు మెచ్చుకుంటుంటే భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం విమర్శిస్తున్నారని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచ దేశాలు పొగడటం కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా ఎద్దేవ చేశారు.

దావణగెరెలోని హరిహరాలో బీసీ అభ్యర్ధి హరీష్ కు మద్దతు ఇచ్చి ఆయన్ను గెలిపించాలని అమిత్ షా ఎన్నిలక ప్రచారం చేశారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ హామీలు మొత్తం బోగస్ అని అమిత్ షా ఆరోపించారు.
ఇలాంటి మ్యాజిక్ లు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని అనేక ప్రయత్నాలు చేసిందని, కాని అది సాధ్యం కాకపోవడంతో ఓటర్లను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నదని అమిత్ షా ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించిన మాత్రానా కాంగ్రెస్ పార్టీకి మైలేజీ రాదని, ఆ విషయం ఆ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకుంటే మంచిది అని కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ఎత్తులు వేసినా బీజేపీ కార్యకర్తలు ఏ మాత్రం పట్టించుకోరని, దేశాన్ని ఉద్దరించేది ఎవరు అనే విషయం సామాన్య న్రజలకు తెలుసని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మ్యాజిక్ లు చేసినా ప్రజలు పట్టించుకోరని, కర్ణాటకలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications