పెళ్లికోసం పాదయాత్ర చేస్తున్న పెళ్ళికాని ప్రసాదులు.. పాపం ఎంత కష్టం!!

కర్ణాటక రాష్ట్రంలో పెళ్లికాని ప్రసాదులు తమకు పెళ్లి చేయండి మహాప్రభో అంటూ వేడుకుంటూ వధువుల కోసం నానాపాట్లు పడుతున్నారు. పాదయాత్రకు రెడీ అవుతున్నారు.

ఇప్పుడు దేశవ్యాప్తంగా పాదయాత్రలు సీజన్ కొనసాగుతుంది. రాజకీయ పార్టీ నాయకులు పాదయాత్రలు మాత్రమే కాదు, అనేక సమస్యల పైన కూడా జనాలు పాదయాత్రలు చేస్తున్నారు. అయితే ఒక వింత పాదయాత్ర మాత్రం తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.

కర్ణాటకలో బ్రహ్మచారుల పాదయాత్ర

కర్ణాటకలో బ్రహ్మచారుల పాదయాత్ర

కర్ణాటక రాష్ట్రంలో పెళ్లికాని ప్రసాదులు తమకు పెళ్లి చేయండి మహాప్రభో అంటూ వేడుకుంటూ వధువుల కోసం నానాపాట్లు పడుతున్నారు. వధువుల కోసం వెతికి అలసిపోయిన వారు దైవ కృప కోసం ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 200 మంది యువకులు పాదయాత్ర చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 'బ్రహ్మచారిగళ పాదయాత్రే' అంటే బ్రహ్మచారుల పాదయాత్ర అన్న పేరుతో పాదయాత్ర చేయడానికి రెడీ అయ్యారు.

బ్రహ్మచారుల పాదయాత్ర నిర్ణయం అందుకే

బ్రహ్మచారుల పాదయాత్ర నిర్ణయం అందుకే

ఒకప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా ప్రాంతంలో సాగిన భ్రూణ హత్యలు ఇప్పుడు పెళ్లి కాని యువకుల పట్ల శాపంగా మారాయి. బాగా చదువుకుని, చక్కగా ఉద్యోగాలు చేసుకుని, యోగ్యత ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి వారిని ఇబ్బంది పెడుతోంది. ఇక పెళ్లి కాక బలవంతపు బ్రహ్మచర్యాన్ని అనుభవించలేక డిప్రెషన్ లోకి వెళుతున్న అబ్బాయిలు ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి, వారిని ఓదార్చడానికి, వారికి దైవ శక్తి తోడు కావడానికి సామాజిక కార్యకర్తలు బ్రహ్మచారి పాదయాత్రను నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు.

 మూడు రోజులపాటు మూడు 105 కిలోమీటర్ల మేర పాదయాత్ర

మూడు రోజులపాటు మూడు 105 కిలోమీటర్ల మేర పాదయాత్ర

దీంతో ఈ బ్రహ్మచారుల పాదయాత్రకు బ్రహ్మచారుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. 30 ఏళ్లు దాటిన రెండు వందల మంది బ్రహ్మచారులు మాండ్యాలోని మద్దూరు నుంచి పొరుగు జిల్లా చామరాజనగర్ లోని ప్రఖ్యాత మాలే మహదేశ్వర గుడికి మూడు రోజులపాటు మూడు 105 కిలోమీటర్ల మేర పాదయాత్ర చెయ్యనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీన పెళ్ళికాని ప్రసాదులంతా పాదయాత్రగా బయలుదేరనున్నారు. అయితే ఇంకా ఈ పాదయాత్రకు రిజిస్ట్రేషన్లు పోటెత్తుతున్న నేపథ్యంలో, పాదయాత్ర నాటికి మరింత మంది పాదయాత్ర చేసే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఇప్పటికే మహారాష్ట్రలోనూ పెళ్లి కాని ప్రసాదుల నిరసన

ఇప్పటికే మహారాష్ట్రలోనూ పెళ్లి కాని ప్రసాదుల నిరసన

బ్రహ్మచారులకు బతుకు మీద ఆశ కల్పించడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్క కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో మాత్రమే కాకుండా, ఇప్పటికే మహారాష్ట్ర రాష్ట్రంలోని సోలాపూర్ లోను పెళ్ళికాని ప్రసాద్ లంతా ప్రభుత్వంపై వినూత్న నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే.

క్రాంతి జ్యోతి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో యువకులు పెళ్లి కొడుకుల మాదిరిగా అలంకరించుకొని పెద్ద సంఖ్యలో గుర్రాలపై కలెక్టరేట్ వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ముందు బైఠాయించితమకు పెళ్లి కాకపోవడానికి,తగిన సంఖ్యలో అమ్మాయిలు లేకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అన్నారు.

తాజాగా కర్ణాటక రాష్ట్రంలోనూ పెళ్లి కాని యువకుల వినూత్న కార్యక్రమం

తాజాగా కర్ణాటక రాష్ట్రంలోనూ పెళ్లి కాని యువకుల వినూత్న కార్యక్రమం

రాష్ట్రంలో లింగ నిర్ధారణ చట్టం కట్టుదిట్టంగా అమలు కావడం లేదని,దానివల్లే లింగనిష్పత్తి దారుణంగా పడిపోతుందని,అమ్మాయిల సంఖ్య ఎక్కువగా లేకపోవడానికి అదే కారణమంటూ వారు ఆందోళన చేశారు. ఇక ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంది.

పెళ్లి కాని పురుషులు పాదయాత్ర చేపట్టి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి వెళ్ళేలా చేశారు. ఇప్పటివరకు బెంగళూరు, మైసూర్లలో మాత్రమే కాకుండా ,మాండ్య మరియు శివమొగ్గ జిల్లాతో పాటు చాలా మంది స్థానిక యువకులు పాదయాత్రకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇక పెళ్ళికాని ప్రసాదులు చేస్తున్న ఈ పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తే సమస్య తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+