ముస్లీం విద్యార్థిని కిడ్నాప్ చేసి అపార్ట్ మెంట్ లో ఏం చేశారంటే ?, లీడర్ కొడుకు డీల్ తో!

బెంగళూరు/మంగళూరు: ఓ ముస్లిం విద్యార్థిని కిడ్నాప్ చేసి ఆ యువకుడి మీద దారుణంగా దాడి హత్య చెయ్యడానికి ప్రయత్నించిన కేసులో మంగళూరు పోలీసులు ఎట్టకేలకు ఎస్‌డీపీఐ నాయకుడి కుమారుడితో సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. కాలేజీలో చదువుతున్న ముస్లిం విద్యార్థులను కిడ్నాప్ చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఇదే ఆరోపణలపై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) నాయకుడు అన్వర్ సాదత్ కుమారుడు అబ్దుల్లా హన్నన్ అలియాస్ హన్నన్ సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీం తబీష్ (19), ముహమ్మద్ షకీఫ్ (19), మహమ్మద్ షేక్ (19), యుపి తన్వీర్ (19), అబ్దుల్ రషీద్ (20), మన్సూర్ (19) అనే నిందితులను అరెస్టు చేశామని శనివారం మంగళూరు సిటీ పోలీసులు తెలిపారు.

What did they do in the apartment after kidnapping a Muslim college student?

ఎస్‌డీపీఐ నేత అన్వర్ సాదత్ కుమారుడు హనాన్‌పై గూండాయిజం ఆరోపణలు వచ్చాయి. మంగళూరు శివార్లలోని అడయార్ సమీపంలోని ఓ ఫ్లాట్‌లో నగరంలోని అలోషియస్ కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థిని నిర్బందించి అతని మీద దాడి చేశారని పోలీసులు అన్నారు. మంగళూరులోని బల్మత్ సమీపంలోని మరో ప్రైవేట్ కళాశాలకు చెందిన ముస్లిం విద్యార్థులపై దాడి జరిగింది, బాలికపై కూడా ముస్లిం విద్యార్థులు కిడ్నాప్ చేసి దాడి చేసినట్లు ఫిర్యాదు వచ్చింది.

ఓ ప్రైవేట్ ఫ్లాట్‌లో అరెస్టు అయిన యువకులు గంజాయి మత్తులో కాలేజ్ విద్యార్థినిని కొట్టి చంపడానికి ప్రయత్నించాని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బెల్టులు, కర్రలతో దాడి చేసి కత్తితో దాడి చేశారు. దాడికి గురైన విద్యార్థిని కేరళ రాష్ట్రం కాసర్‌గోడ్ జిల్లా ఉప్పల్‌కు చెందిన ఇబ్రహీం ఫాహీమ్ (18)గా గుర్తించామని పోలీసులు అన్నారు. ఎస్‌డీపీఐ నాయకుడు అన్వర్ సాదత్ కుమారుడు హనాన్ ఈ దాడికి సూత్రధారిగా అని పోలీసులు అంటున్నారు.

కేరళకు చెందిన ఇబ్రహీం పాహిన్‌ను ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం కిడ్నాప్ చేసి తీవ్రంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన పాహిమ్ శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసి కాసరగూడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు అన్నారు. హన్నన్ సహా ఏడుగురిని మంగళూరు పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడిపై నిందితులు దాడి చేశారని వాంగ్మూలం అందిందని, విచారణ కొనసాగుతోందని మంగళూరు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+