Wife: విడాకుల పంచాయితీతో రాజీకి పిలిచిన మామ, భార్య ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భర్త, నలుగురు!
బెంగళూరు/యాదగిరి: పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. గొడవ జరిగిన ప్రతిసారి భార్య అలిగి ఆమె పుట్టింటికి వెళ్లిపోయేది. భర్త అతని భార్య పుట్టింటికి వెళ్లి ఆమెకు నచ్చచెప్పి రాజీ చేసి ఇంటికి పిలుచుకుని వస్తున్నాడు. మళ్లీ భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. విసిగిపోయిన భర్త విడాకులు కావాలని డిమాండ్ చేశాడు.
భార్య తండ్రి మాట్లాడటానికి రావాలని అల్లుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఇంట్లో మామతో పాటు మరో నలుగురు కుర్చుని అల్లుడిని బుజ్జగించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన అల్లుడు బయట డోర్ లాక్ చేసి కిటికిలో నుంచి ఇంట్లోకి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైనాడు.

10 ఏళ్ల క్రితం పెళ్లి
కర్ణాటకలోని యాదగిరి జిల్లాలోని సురపుర తాలుకా నారాయణపురంలో హులిగమ్మ అలియాస్ లింగమ్మ అనే మహిళ నివాసం ఉంటున్నది. యాదగిరి జిల్లాకు చెందిన శరణప్ప అనే వ్యక్తితో లింగమ్మ పెళ్లి చెయ్యాలని కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు మాట్లాడుకున్నారు. పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకున్న శరణప్ప, లింగమ్మ దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

గొడవపడి పుట్టింటికి వెళ్లిపోతున్న భార్య
శరణప్ప, లింగమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రానురాను శరణప్ప, లింగమ్మ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. గొడవ జరిగిన ప్రతిసారి శరణప్ప భార్య లింగమ్మ అలిగి ఆమె పుట్టింటికి వెళ్లిపోయేది. శరణప్ప అతని భార్య లింగమ్మ పుట్టింటికి వెళ్లి ఆమెకు నచ్చచెప్పి రాజీ చేసి ఇంటికి పిలుచుకుని వస్తున్నాడు.

విసిగిపోయి విడాకులు అడిగాడు
కొన్ని నెలల క్రితం లింగమ్మ మళ్లీ భర్త శరణప్పతో గొడవపడి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. విసిగిపోయిన శరణప్ప తనకు విడాకులు కావాలని అతని భార్య లింగమ్మను డిమాండ్ చేశాడు. భార్య లింగమ్మ తండ్రి సిద్దరామప్ప మనం కుర్చుని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుందామని, నువ్వు ఊరికి రావాలని అల్లుడు శరణప్పకు ఫోన్ చేసి చెప్పాడు.

పెట్రోల్ పోసి భార్య ఇంటికి నిప్పంటించిన భర్త
ఇంట్లో మామ సిద్దరామప్పతో పాటు మరో ముత్తప్ప, నాగప్ప, శరణప్ప సురూరా కుర్చుకుని అల్లుడు శరణప్పను బుజ్జగించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన శరణప్ప బయట డోర్ లాక్ చేసి కిటికిలో నుంచి భార్య ఇంట్లోకి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైనాడు. భార్య లింగమ్మ మీద కోపంతో ఇంటికి నిప్పంటించడంతో భార్య తండ్రి సిద్దరామప్పతో పాటు నలుగురికి మంటలు వ్యాపించి తీవ్రగాయాలై లింగసనూరు, రాయచూరు జిల్లా ఆషుపత్రిల్లో చావుబతుకులతో పోరాడుతున్నారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications