హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bigg Boss 6 Telugu: నామినేషన్స్ లిస్ట్: నాగ్..నో ఎక్స్‌క్యూజ్: లీస్ట్‌లో ఆ కంటెస్టెంట్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రెండో వారంలో అడుగు పెట్టింది. కంటెస్టెంట్స్ మధ్య బిగ్‌బాస్ పెట్టే గేమ్స్ ఆసక్తిని రేపుతున్నాయి. తొలివారం హౌస్ కేప్టెన్‌గా బాలాదిత్య సెలెక్ట్ అయ్యాడు. స్టార్ ఆఫ్ ది వీక్ టైటిల్‌ను కూడా ఎగరేసుకెళ్లాడు. ప్రస్తుతం అతని హవా బిగ్‌బాస్ హౌస్‌లో కనిపిస్తోంది. తోటి కంటెస్టెంట్స్ అందరినీ డామినేట్ చేస్తోన్నాడు బాలాదిత్య.

ఫస్ట్ వీక్‌లో నో ఎలిమినేషన్..

ఫస్ట్ వీక్‌లో నో ఎలిమినేషన్..

ఈ వారం ఎవ్వరినీ ఎలిమినేట్ చేయలేదు బిగ్ బాస్. నామినేషన్స్ ప్రాసెస్ యధాతథంగా కొనసాగినప్పటికీ- చివర్లో అనూహ్యంగా షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం ఎలిమినేషన్‌ను క్యాన్సిల్ చేసినట్లు హోస్ట్ నాగార్జు ప్రకటించారు. శ్రీసత్య, చలాకి చంటి, రేవంత్, ఆరోహి, ఫైమా, ఇనయ సుల్తానా, అభినయశ్రీ.. ఎలిమినేషన్‌కు ఎంపికయ్యారు. వారిలో శ్రీసత్య, చలాకి చంటి శనివారమే సేఫ్ అయ్యారు. రేవంత్, ఆరోహి, ఫైమా, ఇనయ సుల్తానా, అభినయశ్రీల్లో ఒకరు తొలివారమే ఎలిమినేట్ కావడం ఖాయమైందనుకున్నారు.

రెండోవారం లిస్ట్ ఇదే..

రెండోవారం లిస్ట్ ఇదే..

ఆ దశలో హోస్ట్ అక్కినేని నాగార్జున అసలు ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం ఎవ్వరినీ ఎలిమినేట్ చేయట్లేదంటూ ప్రకటించారు. ఫస్ట్ వీక్- నో ఎలిమినేషన్‌గా మారింది. సెకెండ్ వీక్‌లో అలాంటి పరిస్థితులు ఉండవు. ఎలిమినేట్ అయ్యే ఫస్ట్ కాంటెస్టెంట్ ఎవరనేది ఈ వీకెండ్‌లో తేలిపోనుంది. రెండో వారంలో రేవంత్, ఫైమా, ఆది రెడ్డి, రోహిత్-మెరీనా, గీతూ రాయల్, షాని, రాజశేఖర్, అభినయ నామినేట్ అయ్యారు. ఎలిమినేషన్ అనేది ఓటింగ్ ఫలితం లేదా మేకర్స్ నిర్ణయంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.

టాప్‌లో..

టాప్‌లో..

ఓటింగ్ ఫలితాల్లో మెరినా-రోహిత్, ఆది రెడ్డి, రేవంత్, ఫైమా అగ్రస్థానంలో ఉన్నారు. రేవంత్‌కి అభిమానుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. వచ్చే వారం కూడా అతను హౌస్‌లో కొనసాగడానికే అవకాశాలు ఉన్నాయి. గీతూపై నెగెటివ్ ట్రెండింగ్ ఉన్నప్పటికీ.. దానికి భిన్నంగా నెటిజన్లు ఆమెకు మద్దతు పలుకుతున్నారు. తమ ఓట్లతో ఆమెకు అండగా ఉంటోన్నారు. ఈ వారం అభినయశ్రీ లేదా షాని ఎలిమినేట్ అవ్వొచ్చనే ప్రచారం సాగుతోంది.

ఓటింగ్ పర్సెంటేజ్ ఇలా..

ఓటింగ్ పర్సెంటేజ్ ఇలా..

తాజాగా రికార్డయిన ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మెరీనా-రోహిత్ సేఫ్‌జోన్‌లో ఉన్నారు. ఈ కపుల్స్‌కు 31.10 శాతంతో 4,516 ఓట్లు పడ్దాయి. ఆది రెడ్డి రెండోస్థానంలో నిలిచాడు. అతనికి 18.23 శాతంతో 2,639 ఓట్లు పోల్ అయ్యాయి. ఫైమా, రేవంత్‌కు దాదాపుగా సమాన స్థాయిలో ఓట్లు వేశారు వీక్షకులు. 15.02, 14.94 శాతం వరకు వారిద్దరికీ ఓట్లు వేసి, అండగా నిలిచారు. గీతు రాయల్-13.97 శాతంతో 2,033 ఓట్లను దక్కించుకుంది. షాని కూడా 10 శాతానికి పైగా ఓటింగ్ రికార్డ్ చేసుకున్నాడు.

లీస్ట్‌లో..

లీస్ట్‌లో..

రాజశేఖర్-977, అభినయశ్రీ-688 ఓట్లతో చివరి స్థానంలో నిలిచారు. ఎలిమినేషన్‌కు చేరుకోవడానికి ఇంకా అయిదు రోజుల గడువు ఉన్నందున ఈ ఓట్ల శాతం భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. దీన్ని ఏ కంటెస్టెంట్ ఎంత మాత్రం వాటిని సాధిస్తారనేది- బిగ్ బాస్ హౌస్‌లో వారి పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లల్లో వారు ఎంత ఫెయిర్‌గా ఆడారనేది దానిపై డిపెండ్ అయి ఉంటుంది.

English summary
On the show airing on September 12th, the Bigg Boss 6 Telugu house hosted the second-week nomination process. Only one nominee per person was requested of the 21 candidates this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X