విచిత్రం: ట్రక్కు ఢీకొని లాక్కెళ్లినా ఆమె ప్రాణాలకేం కాలేదు! (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: ఓ మహిళ తన స్కూటీపై వెళుతుండగా ఓ ట్రక్కు ఢీకొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢీకొన్న ట్రక్కు ఆమెను స్కూటీతో సహా కొన్ని వందల మీటర్ల దూరం లాక్కెళ్లినా ఆమెకేం కాలేదు.

ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు లేవు కానీ, డిసెంబర్ 4న ఈ వీడియో పోస్ట్ అవగా ఇప్పటి వరకు దీనికి మూడు లక్షల మందికిపైగా చూశారు. ఆమె చాలా అదృష్టవంతురాలని, ఇలాంటి ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు పొగోట్టుకున్నరంటూ 2100 మంది నెటిజన్లు ఇప్పటి వరకు ఈ వీడియోకు సంబంధించి తమ అభిప్రాయాలు షేర్ చేశారు.

వీడియో చూస్తుంటే.. ఓ ట్రక్కు టర్నింగ్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అర్థమవుతుంది. ఓ అమ్మాయి నడుపుతున్న స్కూటీని ట్రాక్కు ఢీకొంది. ఆ విషయాన్ని ట్రక్కు డ్రైవర్ గమనించి బ్రేక్ వేసేటప్పటికే ట్రక్కు ఆమెను కొన్ని వందల మీటర్ల దూరం లాక్కెళ్లింది.

అయినా సరే, ఆ అమ్మాయికి ఏమీ కాలేదు. తన చేతులతో భూమిని తాకుతూ కొన్ని వందల మీటర్ల దూరం ప్రయాణించింది. ట్రక్కు ఆగిన వెంటనే లేచి తన కాళ్లపై నిలబడింది. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న ఈ వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A frightening video of a biker's miraculous escape after a collision with a truck has been captured on camera. The clip shows her being dragged for few meters before the truck stops. What makes the clip even more shocking is how quickly the woman gets right back up on her feet.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి