Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అదానీ 'ఏసీసీ' గ్రూప్ దూకుడు.. FY-26 లో 12 శాతం వృద్ధి నమోదు

2026 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ కు చెందిన ఏసీసీ లిమిటెడ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. విక్రయాల్లో 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతేకాక గ్రీన్ పవర్ వాటాను 26.2 శాతానికి పెరిగింది. ఆపరేషనల్ ఎఫీషియన్సీ , మార్కెట్ లో ఏసీసీ గ్రూప్ లీడింగ్ దశలో ఉంది.

అదానీ గ్రూప్ కు చెందిన ఏసీసీ లిమిటెడ్ కంపెనీ.. బిల్డింగ్ మెటీరియల్స్ సొల్యూషన్స్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా గుర్తింపు పొందింది. 2025 జూన్ 30 ముగిసిన మొదటి త్రైమాసికంలో వెల్లడైన ఆర్థిక ఫలితాల్లో ఏసీసీ గ్రూప్ సత్తా చాటింది. ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు, RMX ప్లాంట్ల విస్తరణ, మెరుగైన వృద్ధి, కార్యాచరణ సామర్థ్యం, మార్కెట్ లీడర్‌షిప్ వంటి అంశాలు కంపెనీని అధిక వృద్ధి సాధించడంలో తోడ్పడ్డాయి.

ఈ మేరకు ఏసీసీ లిమిటెడ్ డైరెక్టర్, సీఈఓ వినోద్ బహెటీ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మంచి ఆరంభం లభించింది. ప్రీమియం అమ్మకాలు, నిర్వహణలో నైపుణ్యం, ఖర్చులను తగ్గించడం, పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలతో కంపెనీ ముందుకు సాగుతోంది అని తెలిపారు. వాల్యూమ్స్, సామర్థ్యంలో నిలకడగా వృద్ధి కనిపిస్తోందని, డిజిటల్ మార్పుల వల్ల కస్టమర్లకు, వాటాదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సైన్స్ బేస్డ్ టార్గెట్స్ ఇనిషియేటివ్ (SBTi) ద్వారా నిర్ధారించబడిన నెట్-జీరో లక్ష్యాలతో, పర్యావరణ బాధ్యతలో పరిశ్రమకు నాయకత్వం వహిస్తున్నామని వినోద్ బహెటీ అన్నారు. బాధ్యతాయుతంగా వృద్ధి చెందడం, నిరంతరం ఆవిష్కరణలు చేయడం, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా బిల్డింగ్ మెటీరియల్స్ సొల్యూషన్స్ కంపెనీగా ఎదగడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏసీసీ కంపెనీలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అమ్మకాలు 12 శాతం పెరిగాయి. ట్రేడ్ వాల్యూమ్స్ పెరగడం, ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు అధికంగా ఉండటం దీనికి కారణంగా చెప్పవచ్చు. ఈ సేల్స్ తో ప్రపంచ మార్కెట్లో ఏసీసీ కంపెనీ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.

ఇక గ్రీన్ పవర్ వాటా కూడా గణనీయంగా పెరిగింది. WHRS పవర్ వాటా 9.9 శాతం నుండి 13.9 శాతానికి, సోలార్ పవర్ వాటా 3.4 శాతం నుండి 11.3 శాతానికి పెరిగింది. ఫలితంగా మొత్తం గ్రీన్ పవర్ వాటా 11.9 శాతానికి పెరిగి 26.2 శాతానికి చేరుకుంది. 2028 నాటికి 60 శాతం గ్రీన్ పవర్ వాటా లక్ష్యాన్ని చేరుకోవడానికి స్పష్టమైన ప్రణాళికతో కంపెనీ ముందుకెళుతోంది. తక్కువ ధర కలిగిన పెట్‌ కోక్ వాడకం, గ్రూప్ కంపెనీల మధ్య సమన్వయం వంటి చర్యల ద్వారా కిలోన్ ఇంధన వ్యయం 10 శాతం తగ్గింది. థర్మల్ విలువ 738 k-Cal వద్ద నిలకడగా ఉంది. రాబోయే త్రైమాసికాల్లో ఇది మరింతమెరుగుపడుతుందని భావిస్తున్నారు.

లాజిస్టిక్స్ ఖర్చులు 5శాతం తగ్గి టన్నుకు రూ. 972కి చేరాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రవాణా మార్గాలను ఎంచుకోవడం, రోడ్డు మార్గం ద్వారా నేరుగా సరుకును చేరవేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక కాంక్రీట్ వ్యాపారం కూడా లాభదాయకంగా కొనసాగుతోంది. Q1 FY'26 లో అమ్మకాల పరిమాణం 12శాతం పెరిగి 11.5 మిలియన్ టన్నులకు చేరింది. ఇది మొదటి త్రైమాసికంలో అత్యధిక వాల్యూమ్. ఆర్థికంగా చూస్తే కంపెనీ మంచి ఫలితాలు సాధించింది. మొదటి త్రైమాసికంలో రూ. 6,087 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గత ఏడాది కంటే 17శాతం ఎక్కువ. EBITDA రూ. 778 కోట్లుగా నమోదైంది. ఈ త్రైమాసికంలో కంపెనీ నెట్ వర్త్ రూ. 228 కోట్లు పెరిగి రూ. 18,787 కోట్లకు చేరింది. EPS (Diluted) రూ. 19.9గా ఉంది.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏసీసీ, అంబుజా సిమెంట్స్ సంస్థలు సైన్స్ బేస్డ్ టార్గెట్స్ ఇనిషియేటివ్ (SBTi) నుండి గుర్తింపు పొందాయి. డిజిటల్ BRSR (బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్టింగ్)ను కంపెనీ ప్రారంభించింది. ఇది కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. బ్రాండింగ్, సాంకేతిక సేవలలో భాగంగా CREDAIతో ప్రత్యేక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా స్థిరమైన పట్టణ నిర్మాణాన్ని ప్రోత్సహించవచ్చు. ప్రీమియం ఉత్పత్తి శ్రేణిని ప్రోత్సహించడానికి కొత్త డిజిటల్ వీడియోను విడుదల చేసింది. ఇది 125 మిలియన్ల వీక్షణలను పొందింది. ప్రీమియం ఉత్పత్తి వాటా 41శాతనికి పెరిగింది. డిజిటలైజేషన్‌ లో భాగంగా, అడ్రస్ స్టాండడైజేషన్ కోసం DIGIPIN ను ప్రారంభించింది. SAP నిధుల నిర్వహణను అమలు చేసింది. ప్లాంట్ కంట్రోల్ సిస్టమ్స్‌ కు రిమోట్ యాక్సెస్ సౌకర్యాన్ని కల్పించింది.

2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సిమెంట్ డిమాండ్ 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగం నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇది సాధ్యమైంది. FY'26 లో సిమెంట్ డిమాండ్ 6శాతం నుండి 7శాతం వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ACC Limited Kicks Off FY26 with 12 Sales Growth Boosts Green Power Share

అచీవ్‌మెంట్స్ విషయానికి వస్తే, ఏసీసీ, అంబుజా సిమెంట్స్ వరుసగా మూడవ సంవత్సరం 'ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ సిమెంట్ బ్రాండ్'గా గుర్తింపు పొందాయి. అంతేకాకుండా పలు అవార్డులను గెలుచుకున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+