రూ.30 వేల కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ మెగా ప్రాజెక్ట్..
కేరళ లోని విజింజం ( vizhinjam ) అంతర్జాతీయ సీపోర్ట్ రెండో దశ పనులకు శంఖుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇది రాష్ట్ర సముద్రయాన, ఆర్థిక అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీనికి రూ.16,000 కోట్ల అదనపు పెట్టుబడితో కలిపి మొత్తం రూ.30,000 కోట్ల నిధులతో ఈ మెగా ప్రాజెక్ట్ చేపట్టింది.
కాగా రూ.30,000 కోట్ల ఏపీసెజ్ నిధులతో విజింజమ్ ( vizhinjam ) రెండో దశ పనులను 2029 నాటికి పూర్తి చేయనున్నారు. అందులో భాగంగా పోర్టు సామర్థ్యాన్ని 1 మిలియన్ టీఈయూల నుండి 5.7 మిలియన్ టీఈయూలకు పెంచుతుంది. ఇది కేరళను గ్లోబల్ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్‌గా బలోపేతం చేస్తూ, భారతదేశంలో పోర్ట్-నేతృత్వ ఆర్థిక వృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా ఏపీసెజ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ మాట్లాడుతూ.. ఈ మెగా ప్రాజెక్ట్ రెండో దశ శంఖుస్థాపన కార్యక్రమం కేరళ-భారత సముద్ర భవిష్యత్తుకు చారిత్రాత్మకమని అభివర్ణించారు. విజింజమ్ ( vizhinjam ) ప్రపంచస్థాయి పోటీ ట్రాన్స్‌షిప్‌మెంట్ కేంద్రంగా, పోర్ట్-ఆధారిత అభివృద్ధికి కీలక స్తంభంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వాల మధ్య రాజకీయ దార్శనికత కొనసాగింపును ప్రతిబింబిస్తుందని కరణ్ అదానీ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ నాయకత్వంలోనే ఈ ప్రాజెక్ట్ మొదట మంజూరైందని అంగీకరించారు. అలానే ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిరంతర మద్దతును ఆయన ప్రశంసించారు. పెద్ద గ్రీన్‌ఫీల్డ్ మౌలిక సదుపాయాల అమలుకు రాజకీయ స్పష్టత, పరిపాలనా నిబద్ధత కీలకమని అదానీ ప్రస్తావించారు. రాజకీయ నాయకుల ద్విపక్ష మద్దతు, కేరళ ఆర్థిక ప్రాధాన్యతలపై ఇన్వెస్టర్లకు బలమైన సంకేతం పంపుతుందన్నారు.
పోర్టు పనితీరును ప్రస్తావిస్తూ, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన కేవలం 15 నెలల్లోనే విజింజమ్ ( vizhinjam ) ఒక మిలియన్ టీఈయూలు నిర్వహించిన అత్యంత వేగవంతమైన భారతీయ పోర్టుగా నిలిచిందని అదానీ తెలిపారు. ఇది కేరళను ప్రపంచ షిప్పింగ్ పటంలో పటిష్టం చేసిందని తెలిపారు. దశ-2 పూర్తితో 2029 నాటికి పోర్టు సామర్థ్యం 1 మిలియన్ నుండి 5.7 మిలియన్ టీఈయూలకి పెరుగుతుందన్నారు. దీనితో విజయం భారత ఉపఖండంలో అతిపెద్ద ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్టుగా, దేశంలో అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన వాటిలో ఒకటిగా అవతరిస్తుందని చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ కేవలం పోర్ట్ విస్తరణ కాదని, జాతీయ సామర్థ్య విస్తరణ అని అదానీ స్పష్టం చేశారు. సాంకేతికత, సామర్థ్యం, స్థాయి పరంగా భవిష్యత్ భారతీయ పోర్టులకు ఇది ఒక నమూనాగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కేరళ, కేంద్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, తిరువనంతపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదానీ గ్రూప్‌పై వారి విశ్వాసానికి, తమ నిబద్ధతలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
ఈ వేడుకకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, ప్రతిపక్ష నాయకుడు విడి సతీసన్, పార్లమెంటు సభ్యులు, కేంద్ర, రాష్ట్ర అధికారులు, పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications