ఇంధన రంగంలో చేతులు కలిపిన అదానీ టోటల్ గ్యాస్ జియో-బీపీ..!
అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ATGL), జియో-బిపి సంస్థలు భారతదేశంలో ఇంధన విక్రయ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎంపిక చేసిన అవుట్‌లెట్‌లలో అధిక- పనితీరు గల ఇంధనాలను అందించడం ద్వారా వినియోగదారులకు మరింత మంచి సేవలను అందించడమే ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం.
జియో-బిపి, అదానీTotal Gas ఒప్పందం
ఈ భాగస్వామ్యం ద్వారా రెండు సంస్థలు తమ బలాన్ని ఉపయోగించి వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. జియో-బిపి యొక్క అధిక పనితీరు గల పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు ATGL యొక్క యూనిట్లలో అందుబాటులో ఉంటాయి. అలాగే ATGL యొక్క కంప్రెస్డ్ గ్యాస్ (GA) కూడా జియో-బిపి స్టేషన్లలో లభిస్తుంది. దీని ద్వారా వినియోగదారులకు అధిక-నాణ్యత గల ఇంధనం అందుబాటులోకి వస్తుంది.

అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ATGL) అనేది టోటల్ ఎనర్జీస్ మరియు భారతదేశంలోని ప్రముఖ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) సంస్థలలో ఒకటి. ఇది ఇళ్లకు, పరిశ్రమలకు, వాణిజ్య సంస్థలకు ఇతర వాహనదారులకు గ్యాస్ ను సరఫరా చేస్తుంది. అలాగే కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG), ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తుంది.
జియో-బిపి విషయానికి వస్తే, ఇది రిలయన్స్ BP మొబిలిటీ లిమిటెడ్‌కు సంబంధించిన బ్రాండ్. ఇది భారతదేశంలో ఇంధన రిటైలింగ్ మరియు తక్కువ కార్బన్ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక స్టోర్లను కూడా నిర్వహిస్తోంది.
జియో-బిపి ఛైర్మన్ హరీష్ సి. బెహూరియా మాట్లాడుతూ, "భారతదేశంలో వినియోగదారులకు అధిక-నాణ్యత గల ఇంధనాలను అందించడానికి అదానీ టోటల్ గ్యాస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉంది. ఈ కలయిక ద్వారా రెండు సంస్థలు తమ అనుభవాలను పంచుకుంటాయి" అని అన్నారు.
అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.మాంగ్లాని మాట్లాడుతూ, "ఈ భాగస్వామ్యం ద్వారా రెండు సంస్థల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తాం" అని తెలిపారు.
ప్రస్తుతం ATGLకి సుమారు 650 స్టేషన్లు ఉన్నాయి. జియో-బిపికి దాదాపు 2000 అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ఈ భాగస్వామ్యం రెండు సంస్థలకు మరింత వృద్ధిని అందిస్తుందని భావిస్తున్నారు.ఈ కలయిక వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడానికి ఒక మైలురాయి కానుంది.












Click it and Unblock the Notifications