టిమ్‌కుక్ కంటే ఎక్కువ వేతనం ఆమెకే, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: ఆపిల్ సంస్థ సీఈఓ టిమ్‌ కుక్ కంటే ఆ సంస్థలో పనిచేసే ఏంజెలా రెండ్స్ ఎక్కువగా సంపాదిస్తోంది. 2017లో టిమ్ కుక్ రూ.81.5 కోట్ల వేతనం పొందితే, ఏంజెలా రెండ్స్ రూ.154.09 కోట్ల వేతనాన్ని పొందింది.

సాధార‌ణంగా ఏ ఆఫీసులోనైనా ఉద్యోగుల సంపాద‌న కంటే సీఈఓ సంపాద‌న ఎక్కువ‌గా ఉంటుంది. కానీ ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత మొబైల్ త‌యారీ సంస్థ ఆపిల్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

Apple’s highest-paid executive earns nearly twice as much as CEO Tim Cook

2017లో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కంటే ఆ సంస్థ‌లో ప‌నిచేసే ఉద్యోగి దాదాపు రెట్టింపు సంపాదించారు. ఆమె పేరు ఏంజెలా రెండ్స్. ఆపిల్ సంస్థ‌లో రిటైల్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేస్తోంది.

ఆపిల్ సంస్థ అకౌంట్ లెక్క‌ల ప్ర‌కారం.. 2017లో టిమ్ కుక్ రూ. 81.5 కోట్లు వేత‌నంగా పొంద‌గా, ఏంజెలా రెండ్స్ రూ. 154.09 కోట్లు పొందారు. జీతం విష‌యంలో ఏంజెలా, టిమ్ కుక్‌ల మ‌ధ్య చాలా తేడా ఉంది.

అయిన‌ప్ప‌టికీ సీఈఓకి లేని అద‌న‌పు స‌దుపాయాలు ఏంజెలాకి ఉండ‌టంతో ఇంత సంపాద‌న సాధ్య‌మైంది. అంతేకాకుండా టిమ్ కుక్‌కి చెల్లించాల్సిన వాటిలో స్టాక్ అవార్డుల‌ను గ‌ణించ‌క‌పోవ‌డంతో ఏంజెలా సంపాద‌న ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Angela Ahrendts, Apple’s senior vice-president of retail and online stores, is once again Apple’s best-paid employee.The 57-year-old tech exec took home US$24.2 million in 2017, according to Apple company filings.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి