దూసుకెళ్తున్న AWL అగ్రి బిజినెస్ .. ఈ ఏడాది ఏకంగా 21 శాతం వృద్ధి
AWL అగ్రి బిజినెస్ FY26 మొదటి త్రైమాసికంలో రూ. 17,059 కోట్ల అత్యధిక ఆదాయాన్ని సమకూర్చింది. గతేడాదితో పోలిస్తే 21శాతం పెరుగుదల నమోదు చేసింది. ఈ వృద్ధికి ప్రధాన కారణం ఎడిబుల్ ఆయిల్ విభాగం అని సంస్థ పేర్కొంది. ఈ విభాగం 26శాతం వృద్ధితో రూ. 13,415 కోట్లు ఆర్జించినట్లు తెలిపింది. ఈ విలువ మొత్తం ఆదాయంలో 78.6 శాతంగా ఉందని.. అంతేకాక మొత్తం వాల్యూమ్ మిక్స్ లో 61 శాతంగా ఉందని పేర్కొంది.
ది ఫూడ్ అండ్ FMCG రంగం స్వల్పంగా 4 శాతం వృద్ధిని సాధించి రూ. 1,414 కోట్లకు చేరుకుంది. ఈ విభాగం మొత్తం ఆదాయంలో 8 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, మొత్తం వాల్యూమ్ మిక్స్ లో మాత్రం 16శాతం వాటా ఉంది. ఈ త్రైమాసికంలో, AWL ఈ విభాగంలో ధరలను పెంచింది.
AWL అగ్రి బిజినెస్ మార్కెట్ విస్తరణ
AWL అగ్రి బిజినెస్ కీలక ముందడుగు వేసింది. AWL.. తన ఎడిబుల్ ఆయిల్ విభాగం నుండి వచ్చే ఆదాయాన్ని ఫుడ్ & FMCG వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఈ వ్యాపారం విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఎడిబుల్ ఆయిల్ విభాగం ఏటా సుమారు రూ. 1,200-రూ. 1,500 కోట్ల ఆదాయాన్ని నమోదు చేస్తుంది, ఈ ఆదాయాన్ని కొత్త రంగాల్లో పెట్టుబడులకు తరలిస్తోంది. మార్కెట్ ఉనికిని పెంచేందుకు, AWL తన రిటైల్ కవరేజీని 18 శాతం పెంచింది. దీంతో ప్రస్తుతం 8.7 లక్షల అవుట్ లెట్‌లకు చేరుకుంది. ఈ విస్తరణలో సుమారు 55,000 గ్రామీణ పట్టణాలు ఉన్నాయి. FY22 నుండి పది రెట్లు పెరుగుదలను సూచిస్తుంది.
ఆర్థిక పనితీరు మరియు స్టాక్ వాల్యుయేషన్
స్థిరమైన ఆదాయ వృద్ధి ఉన్నప్పటికీ, ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ త్రైమాసికంలో నికర లాభం రూ. 238 కోట్లకు తగ్గింది. విక్రయించబడిన వస్తువుల వ్యయం (COGS) 25 శాతం పెరిగింది. ఇది ఆదాయ వృద్ధి రేటును మించిపోయింది. అయితే, గత మూడు నెలల్లో ముడి పదార్థాల ధరలు 10 శాతం కంటే ఎక్కువ తగ్గాయి. ఈ తగ్గింపులు భవిష్యత్ త్రైమాసికాల ఆర్థిక పనితీరుకు ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు.

జులై 15 న AWL స్టాక్ ఒక్కో షేరుకు రూ. 263 వద్ద ముగిసింది, ఇది మూడు సంవత్సరాలలో కనిష్టంగా 30 రెట్ల Trailing twelve-month earnings వద్ద ట్రేడ్ అవుతోంది. AWL ప్రధాన ఎడిబుల్ ఆయిల్ విభాగం నుండి బలమైన నగదు ప్రవాహాన్ని కొనసాగిస్తూనే, దాని ఫుడ్ & FMCG వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టడం భవిష్యత్తులో ఈ రంగంలో వృద్ధికి దోహదపడుతుంది.












Click it and Unblock the Notifications