వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోసాలకు మారుపేరు: రోజుకు బ్యాంకుల్లో రూ.38.4 కోట్లు హాంఫట్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: గంటకు రూ.1.6 కోట్లు! నకిలీలు, మోసాలతో బ్యాంకులు తల్లడిల్లుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులనైతే మోసగాళ్లు అలవోకగా మోసం చేసేస్తున్నారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి రోజు చీటింగ్, ఫోర్జరీలవల్ల బ్యాంకులకు వాటిల్లిన నష్టం ఎంతో తెలుసా?.. రూ.38.4 కోట్లని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లెక్కలే ఇలా చెబుతున్నాయి. ఆర్బీఐ పేర్కొన్న ఎనిమిది రకాల మోసాల్లో ఒకటైన చీటింగ్ - ఫోర్జరీలతోనే బ్యాంకులు 60% నష్టపోతుండటం గమనార్హం.
ఈ నష్టాలు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి రుణాలు పొందడం లేదా తప్పుడు ప్రకటనలతో బ్యాంకుల్ని నమ్మించడంతో వస్తున్నాయి. ఇక ఆర్బీఐ వివరాల ప్రకారం 2014-15, 2015-16, 2016-17ల్లో దేశీయ బ్యాంకింగ్ రంగానికి చీటింగ్, ఫోర్జరీల వల్ల కలిగిన మొత్తం నష్టం రూ.42,266 కోట్లకు చేరుకున్నదని గణాంకాలు చెబుతున్నాయి.

మోసాల్లో ఎస్బీఐ వాటా రూ.5743 కోట్లు

మోసాల్లో ఎస్బీఐ వాటా రూ.5743 కోట్లు

రూ.37,583 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాలైతే, రూ.4,683 కోట్లు ప్రైవేట్ రంగ బ్యాంకులవని ఆర్బీఐ పేర్కొన్నది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నష్టాలే రూ.5,743 కోట్లు కావడం గమనార్హం. మొత్తం మోసాల్లో ఇది 15 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా పూర్తిగా లెక్కలు తేలాలి. అయితే ఈ నష్టాల్లో 89 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులవే. కాగా, వీటికి సంబంధించి 7,505 కేసులు నమోదవగా, 4,702 కేసులు ప్రభుత్వ బ్యాంకుల నుంచి వచ్చినవే.

రూ. లక్షకు తక్కువ మోసాలు కలిపితే రూ.వందల కోట్లు?

రూ. లక్షకు తక్కువ మోసాలు కలిపితే రూ.వందల కోట్లు?

బ్యాంకుల్లో జరిగిన మొత్తం మోసాల్లో నష్టం విలువ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.70,000 కోట్లని నమోదైంది. ఇదంతా రూ.లక్షకుపైగా జరిగిన మోసాల విలువే. రూ.లక్షకు తక్కువగా ఉన్న మోసాలనూ పరిగణనలోకి తీసుకుంటే నష్టాలు మరింతగా పెరుగడం ఖాయం. అది రూ. వందల కోట్లకు చేరుకుంటుందని అంచనా. మరోవైపు బ్యాంకు సిబ్బంది ప్రమేయం లేకుండా ఈ స్థాయిలో మోసాలు జరుగడం అసాధ్యమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతుండగా, బ్యాంకింగ్ వ్యవస్థలో శిక్షణ వైఫల్యం, విధివిధానాల్లో లోపాల మూలంగానే మోసాలకు ఆస్కారం ఉంటున్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రూ.11,251 కోట్ల నుంచి రూ.14.025 కోట్లకు శఠగోపం

రూ.11,251 కోట్ల నుంచి రూ.14.025 కోట్లకు శఠగోపం

2014 - 15లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలు రూ.11,251 కోట్లు, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మోసాల విలువ రూ.730 కోట్లు కాగా, 2015 - 16లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.12,307 కోట్లు, ప్రైవేట్ బ్యాంకుల్లో రూ.906 కోట్ల మేరకు శఠగోపం పెట్టేశారు. ఇక 2016 - 17లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాల విలువ రూ.14,025 కోట్లకు, ప్రైవేట్ బ్యాంకుల్లో రూ.3,047 కోట్లుగా నమోదైంది. మొత్తం బ్యాంకుల్లో 7505 మోసాల కేసులు నమోదు కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,702 కేసులు ఉంటే, ప్రైవేట్ బ్యాంకుల్లో 2,803 కేసులు నమోదయ్యాయి.

పీఎన్బీలో రూ.9 కోట్లకు మోస పూరిత లావాదేవీలు

పీఎన్బీలో రూ.9 కోట్లకు మోస పూరిత లావాదేవీలు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)లో వెలుగుచూసిన రూ. 12వేల కోట్ల కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే బ్యాంకులో మరో మోసం బయటపడింది. పీఎన్‌బీ ముంబయి బ్రాంచ్‌లో రూ. 9కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎక్కడైతే రూ. 12వేల కోట్ల కుంభకోణం జరిగిందో అదే బ్రాంచ్‌లో తాజా మోసం కూడా వెలుగుచూడటం గమనార్హం. చాంద్రీ పేపర్‌, అల్లయిడ్‌ ప్రొడక్ట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు చెందిన కొందరు అధికారులు ఈ బ్రాంచ్‌లో రూ. 9కోట్ల మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు సమాచారం. దీంతో ఆయా సంస్థలపై సీబీఐ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు పీఎన్‌బీ గానీ.. ఇటు చాంద్రీ పేపర్‌ గానీ ఇంతవరకూ స్పందించలేదు.

పీఎన్బీ మోసం కేసులో పట్టించుకోని రాజకీయ పార్టీలు

పీఎన్బీ మోసం కేసులో పట్టించుకోని రాజకీయ పార్టీలు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ.12వేల కోట్ల కుంభకోణం నేపథ్యంలో లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్స్‌(ఎల్‌ఓయూ) జారీ చేయకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నిషేధం విధించింది. ఈ సందర్భంగా ఎల్‌ఓయూల జారీపై ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) స్పందించింది. పీఎన్‌బీ మినహా ఇంతవరకూ ఏ బ్యాంకులు నకిలీ ఎల్‌ఓయూలు గానీ, అనధికారిక ఎల్‌ఓసీలు(లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) గానీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకు సీనియర్‌ అధికారులు మీడియాకు వెల్లడించారు.

మోసాల నివారణకు ఎల్వోయూలపై నిషేధం విధించిన ఆర్బీఐ

మోసాల నివారణకు ఎల్వోయూలపై నిషేధం విధించిన ఆర్బీఐ

‘అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు తాము జారీ చేసిన ఎల్‌ఓయూలను పరిశీలించాయి. పీఎన్‌బీ జారీ చేసినవి మినహా మిగతా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చిన ఎల్‌ఓయూలు ధ్రువీకృతమైనవే' అని ఎస్‌బీఐ అధికారులు తెలిపారు. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన బంధువు మెహుల్‌ ఛోక్సీ తదితరులు అక్రమంగా బ్యాంకు నుంచి ఎల్‌ఓయూలు పొంది వేల కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కుంభకోణం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఆర్‌బీఐ ఈ తరహా మోసాలు మరోసారి జరగకుండా ఉండేందుకు ఎల్‌ఓయూల జారీపై నిషేధం విధించింది.

English summary
BENGALURU: Every hour, Indian banks lose Rs 1.6 crore to just “cheating and forgery”, one of the oldest methods of frauds which accounts for a little more than 60 per cent of all money lost by banks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X