Union Budget 2026 : ఈ సారి వ్యవసాయ బడ్జెట్ ఎంత?

రైతులకు మంచి శుభవార్త తీసుకొచ్చేలా కేంద్ర బడ్జెట్-2026 రూపుదిద్దుకుంటోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, ఎండల తీవ్రత, ధరల ఊగిసలాటతో కుదేలవుతున్న వ్యవసాయ రంగాన్ని ఇకపై కేవలం జీవనాధారంగా కాకుండా లాభసాటి, సుస్థిర వ్యాపారంగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేయనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈసారి బడ్జెట్‌లో సంప్రదాయ సాగు పద్ధతులకు గుడ్‌బై చెప్పి, సాంకేతికత ఆధారిత 'స్మార్ట్ అగ్రికల్చర్' వైపు దూకుడు కనిపించనుంది. తాత్కాలిక సబ్సిడీలకే పరిమితం కాకుండా... రైతు ఆదాయం పెరిగేలా, ఉత్పాదకత మెరుగుపడేలా, మార్కెట్‌కు నేరుగా అనుసంధానం అయ్యేలా దీర్ఘకాలిక విధానాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. రైతు సంక్షేమం ఇప్పుడు ప్రభుత్వ ఆర్థిక వ్యూహంలో కేంద్ర బిందువుగా మారుతోందని ఇది స్పష్టం చేస్తోంది.

Budget 2026 Brings Big Relief for Farmers Focus on Smart and Profitable Agriculture

భారీగా కేటాయింపులు..

గత పదేళ్లలో వ్యవసాయానికి కేటాయింపులు భారీగా పెరగడం కూడా ఇదే దిశను సూచిస్తోంది. 2013-14లో కేవలం రూ. 21,933 కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్... ఇప్పుడు రూ. 1.27 లక్షల కోట్లకు పైగా చేరడం గమనార్హం. ఈ పెరుగుదల రైతులపై పెట్టుబడిని ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యమో చెబుతోంది.

క్లైమేట్-రెసిలియంట్..

బడ్జెట్-2026లో క్లైమేట్-రెసిలియంట్ అగ్రికల్చర్ కీలకంగా మారనుంది. కరువు, వరదలను తట్టుకునే ఆధునిక విత్తనాల అభివృద్ధికి అదనపు నిధులు, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ సేద్యం వంటి నీటి సంరక్షణ పద్ధతులకు మరింత ప్రోత్సాహం, సేంద్రియ సాగు ద్వారా భూసారాన్ని కాపాడే విధానాలు బడ్జెట్‌లో చోటు దక్కే అవకాశముంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గిస్తూ రైతును రక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉండనున్నాయి.

PPP మోడల్‌

రైతుల నష్టాలకు ప్రధాన కారణంగా మారుతున్న మౌలిక సదుపాయాల లోపాన్ని తీర్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోల్డ్ స్టోరేజ్‌లు, గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేలా PPP మోడల్‌ను మరింత బలోపేతం చేయనున్నారు. పంట కోత తర్వాత నష్టం తగ్గి, రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా రవాణా నెట్‌వర్క్‌ల ఆధునీకరణ కూడా బడ్జెట్‌లో కీలక అంశంగా ఉండనుంది.

రైతుల ఆదాయ వనరులు..

ఇకపై వరి, గోధుమలకే పరిమితం కాకుండా హార్టికల్చర్, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాలు వంటి అధిక లాభాల పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఎగుమతి ఆధారిత వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాలు కూడా బడ్జెట్‌లో కనిపించే అవకాశముంది. దీంతో రైతుల ఆదాయ వనరులు మరింత విస్తరించనున్నాయి.

రైతుకు టెక్నాలజీని చేతికందించే దిశగా కూడా బడ్జెట్-2026 కీలక అడుగులు వేయనుంది. మొబైల్ యాప్‌ల ద్వారా రియల్‌టైమ్ వాతావరణ సమాచారం, తెగుళ్ల హెచ్చరికలు, పంట ధరల అప్‌డేట్స్ అందించడం, e-NAM వంటి డిజిటల్ మార్కెట్‌లను మరింత బలోపేతం చేయడం ద్వారా దళారీ వ్యవస్థకు చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగనున్నాయి. రుణాలు, బీమా, పంట అంచనాలు అన్నీ డిజిటల్‌గా సులభతరం చేయడం ద్వారా రైతు సమయాన్ని, ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

మొత్తంగా చూస్తే... కేంద్ర బడ్జెట్-2026 రైతులకు నిజంగా శుభవార్తల ప్యాకేజ్లా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మార్కెట్ అనుసంధానం - ఈ మూడు స్తంభాలపై నిలబడి భారత వ్యవసాయాన్ని కొత్త దిశలో నడిపించేందుకు ఈ బడ్జెట్ బాట వేయనుందని వ్యవసాయ వర్గాలు ఆశాభావంతో ఎదురు చూస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+