Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

GOLD బాండ్ల నిబంధనల్లో మార్పులు

యూనియన్‌ బడ్జెట్‌-2026 సార్వభౌమ స్వర్ణ బాండ్లు (Sovereign Gold Bonds) (SGBలు) విషయంలో ఒక కీలకమైన స్పష్టతను తీసుకొచ్చింది. దీంతో చాలా మంది పెట్టుబడిదారుల్లో "ఇప్పుడంటే SGBలపై ఉన్న పన్ను మినహాయింపును ప్రభుత్వం తీసేసిందా?" అనే సందేహం మొదలైంది. అయితే వాస్తవానికి పన్ను రహిత ప్రయోజనం పూర్తిగా రద్దు కాలేదు. కానీ, ఆ ప్రయోజనం ఎవరికి వర్తించాలి అన్న విషయంలో ప్రభుత్వం గీత గీసింది.

ఇప్పటివరకు పరిస్థితి చాలా సులభంగా ఉండేది. ఒక వ్యక్తి SGBను మెచ్యూరిటీ వరకు కలిగి ఉంటే, దానిపై వచ్చే మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. RBI అసలు జారీ సమయంలో నేరుగా కొనుగోలు చేసినా, తర్వాత స్టాక్ మార్కెట్‌ నుంచి తీసుకున్నా-మెచ్యూరిటీ వరకు ఉంచితే పన్ను మినహాయింపు వచ్చేది.

Budget 2026 Changes Sovereign Gold Bonds Tax Rules Capital Gains Exemption Limited to Original RBI Subscribers Only

బడ్జెట్‌-2026తో ఆ విధానంలో మార్పు వచ్చింది.

ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం, సార్వభౌమ స్వర్ణ బాండ్లపై మూలధన లాభాల పన్ను మినహాయింపు ఇకపై ఒక నిర్దిష్ట వర్గానికి మాత్రమే వర్తిస్తుంది. అంటే, RBI జారీ చేసిన సమయంలోనే వ్యక్తిగతంగా సబ్‌స్క్రైబ్ చేసి, ఆ బాండ్‌ను మెచ్యూరిటీ వరకు నిరంతరం కలిగి ఉన్న పెట్టుబడిదారులకే ఈ పన్ను ప్రయోజనం లభిస్తుంది.

SGBను ఎలా, ఎప్పుడు ..

SGBను ఎలా, ఎప్పుడు కొనుగోలు చేశారన్నది ఇప్పుడు చాలా ముఖ్యం. ఇకపై స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ద్వితీయ మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేసిన SGBలు.. అవి మెచ్యూరిటీ వరకు ఉంచినా.. పన్ను మినహాయింపుకు అర్హం కావు. ఇది ఇప్పటివరకు ఉన్న విధానానికి భిన్నం కావడంతో, ద్వితీయ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినవారికి ఇది ముఖ్యమైన మార్పుగా మారింది.

అయితే మొదటి నుంచే RBI జారీ సమయంలో SGBలను తీసుకుని, వాటిని మెచ్యూరిటీ వరకు ఉంచిన పెట్టుబడిదారులకు ఎలాంటి నష్టం లేదు. వారి విషయంలో పాత విధానమే కొనసాగుతుంది. మెచ్యూరిటీ సమయంలో వచ్చే మూలధన లాభాలు పన్ను రహితంగానే ఉంటాయి. అలాగే, SGBలపై లభించే 2.5 శాతం వార్షిక వడ్డీ మాత్రం గతంలోలాగే 'ఇతర వనరుల నుండి ఆదాయం' కింద పన్నుకు లోబడి ఉంటుంది.

ఎలా ప్రభావం చూపుతుందో

ఒక SGBపై బంగారం ధరలు పెరగడంతో ₹10 లక్షల లాభం వచ్చిందనుకుందాం. ఈ బాండ్‌ను RBI జారీ సమయంలోనే కొనుగోలు చేసి, మెచ్యూరిటీ వరకు ఉంచిన పెట్టుబడిదారుడు ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే బాండ్‌ను కొన్ని సంవత్సరాల తర్వాత స్టాక్ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసిన మరో పెట్టుబడిదారుడు, దానిని మెచ్యూరిటీ వరకు ఉంచినా... ఇకపై ఆ ₹10 లక్షల లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ లాభం దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తే, 12.5 శాతం చొప్పున పన్ను పడుతుంది. అంటే సుమారు ₹1.25 లక్షలు పన్నుగా వెళ్లిపోతాయి. మెచ్యూరిటీకి ముందే విక్రయిస్తే లేదా అధిక ఆదాయ స్లాబ్‌లో ఉంటే ఈ పన్ను ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.

ధోరణికి అడ్డుకట్ట పడుతుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మార్పుతో SGBలను ట్రేడింగ్‌ సాధనంగా ఉపయోగించే ధోరణికి అడ్డుకట్ట పడుతుంది. ప్రభుత్వం SGBలను తక్కువకాల లాభాల కోసం కాకుండా, దీర్ఘకాలిక పొదుపు సాధనంగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ స్పష్టతను తీసుకొచ్చినట్లు వారు చెబుతున్నారు.

మొత్తానికి, బడ్జెట్‌-2026 SGBలపై ఉన్న పన్ను రహిత హోదాను పూర్తిగా తొలగించలేదు. కానీ, ఆ ప్రయోజనం అందరికీ కాకుండా, అసలు జారీ సమయంలో పెట్టుబడి పెట్టి, మెచ్యూరిటీ వరకు నిబద్ధంగా కొనసాగించినవారికే పరిమితం చేసింది. ద్వితీయ మార్కెట్‌ పెట్టుబడిదారులు ఇకపై తమ రాబడిని లెక్కించేటప్పుడు మూలధన లాభాల పన్నును తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+