Budget 2026: పన్నుల భారం పెరగనుందా? నిపుణులు హెచ్చరిక?
కేంద్ర బడ్జెట్-2026కు ఇంకా కొన్ని వారాలే ఉండటంతో దేశవ్యాప్తంగా పన్నుల విధానాలపై చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఇన్‌కమ్ ట్యాక్స్, సర్‌చార్జ్, సంపన్నులపై అదనపు పన్నులు అనే అంశాలు ఇప్పుడు పాలసీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మధ్యతరగతికి ఊరట కలిగించే నిర్ణయాలు ఉంటాయా? లేక ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే దిశగా ధనవంతులపై భారం పెంచుతారా? అన్నది ఆసక్తిగా మారింది.
బడ్జెట్-2026 నేపథ్యంలో, జాతీయ మీడియా కథనాల్లో వస్తున్న ప్రధాన అంచనా ఏంటంటే... సంపన్నులపై కొత్త పన్నులు విధించే అవకాశాలు చాలా తక్కువ. ఇందుకు కారణం ఇప్పటికే ఉన్న పన్ను నిర్మాణమే గరిష్ఠ స్థాయికి చేరుకుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనపు సర్‌చార్జ్‌లు లేదా గతంలో రద్దు చేసిన వెల్త్ టాక్స్ (సంపద పన్ను)ను తిరిగి తీసుకురావడం వల్ల భారత్ నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం సర్‌చార్జ్ పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు ప్రాథమిక పన్నుతో పాటు సర్‌చార్జ్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఆదాయం ఉంటే - 10% సర్‌చార్జ్ ఉంది. ఇక రూ.1 కోటి నుంచి రూ.2 కోట్లు వరకు - 15%, రూ.2 కోట్లు నుంచి రూ.5 కోట్లు వరకు - 25%, రూ.5 కోట్లు దాటితే - కొత్త పన్ను విధానంలో 25%, పాత విధానంలో 37% సర్‌చార్జ్ గా అమలవుతుంది. ఇప్పటికే ఈ స్థాయిలో పన్ను భారం ఉండటంతో, మరింత పెంపు చేస్తే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.
పన్నులు పెరిగితే ఎదురయ్యే ప్రమాదాలు
పిడబ్ల్యూసీ (PwC) పన్ను నిపుణుడు అమిత్ రాణా అభిప్రాయం ప్రకారం, అతి ఎక్కువ పన్నులు విధిస్తే క్యాపిటల్ ఫ్లైట్‌కు దారి తీయొచ్చు. అంటే సంపన్నులు, పెద్ద ఇన్వెస్టర్లు తక్కువ పన్నులు ఉన్న దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. స్టార్టప్‌లు, కొత్త పరిశ్రమలు, ఉద్యోగాల సృష్టిలో కీలక పాత్ర పోషించే ఈ వర్గాన్ని ఇబ్బంది పెడితే దేశ ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.
వెల్త్ టాక్స్ తిరిగి వస్తుందా?
వెల్త్ టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం 2015లోనే రద్దు చేసింది. అప్పట్లో దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండటం, అదే సమయంలో ఆస్తుల విలువ లెక్కించడం, నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటమే ప్రధాన కారణాలు. ఇప్పుడు మళ్లీ వెల్త్ టాక్స్ తీసుకురావడం వల్ల బంగారం, షేర్లు, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల విలువ అంచనా వేయడం క్లిష్టంగా మారుతుందని EY నిపుణురాలు సురభి మార్వా చెబుతున్నారు. ప్రస్తుత సర్‌చార్జ్ విధానమే సరళమైనదని ఆమె అభిప్రాయపడుతున్నారు.
బడ్జెట్ 2026లో మార్పులు ఉంటాయా?
డెలాయిట్ నిపుణుడు అలోక్ అగర్వాల్ ప్రకారం, ప్రభుత్వం ఇప్పటికే 2023లో గరిష్ఠ సర్‌చార్జ్‌ను 37% నుంచి 25%కు తగ్గించింది. ఇంత తక్కువ సమయంలోనే మళ్లీ పన్ను భారం పెంచడం రాజకీయంగా, ఆర్థికంగా సాధ్యపడకపోవచ్చని ఆయన అభిప్రాయం. జాతీయ మీడియా విశ్లేషణల ప్రకారం, ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం పన్నులు పెంచడం కంటే పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి కల్పన, వృద్ధికి ఊతమిచ్చే విధానాలపైనే దృష్టి పెట్టే అవకాశం ఎక్కువ.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications