షాక్: భారీగా పెరిగిన డీజీల్ ధరలు, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. డీజీలో ధరలు భారీగా పెరిగి రికార్డు సృష్టించాయి. ఢిల్లీలో లీటర్ డీజీల్‌ను రూ. 59.70లకు విక్రయించారు. ఇదే రికార్డు ధరగా అధికారులు చెబుతున్నారు.

శుభవార్త: పెట్రోల్ ధరలు తగ్గుతాయి, మిథనాల్ పాలసీ: నితిన్ గడ్కరీ

పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే మిథనాల్ పాలసీని తీసుకువస్తున్నట్టు పార్లమెంట్‌లో ప్రకటించింది,. అయితే ఈ తరుణంలోనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరల భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు.

షాక్: భారీగా పెరగనున్న పెట్రోల్, లీటర్‌కు రూ.300, ఎందుకంటే?

డీజీల్ ధరలు పెరిగితే దాని ప్రభావం ఇతర వస్తువులపై కూడ పడే అవకాశం లేకపోలేదు. అయితే పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వాలు సత్వరం చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

డీజీల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి

డీజీల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో డీజీల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకొన్నాయి. ఢిల్లీలో లీటర్ డీజీల్‌ను రూ. 59.70లకు విక్రయించారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక ధరగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.కోల్‌కత్తా, చెన్నైలో కూడా డీజిల్‌ ధరలు 2014 సెప్టెంబర్‌ నాటి గరిష్ట స్థాయిలను నమోదుచేస్తున్నాయి. ముంబైలో కూడా డీజిల్‌ ధరలు 2017 మార్చి నాటి స్థాయిలను నమోదుచేశాయి.

పలు నగరాల్లో అక్టోబర్ మాసం ధరలు

పలు నగరాల్లో అక్టోబర్ మాసం ధరలు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కత్తా లాంటి నగరాల్లో పెట్రోల్ ధరలు 20114, 2017లలో చోటు చేసుకొన్న రికార్డు ధరలను పలుకుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ముడి చమురు ధరలు పెరగానికి తోడు రాష్ట్రాల పన్నులతో వినయోగదారులకు మరింత భారంగా మారుతోంది.

పన్నులు తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

పన్నులు తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

పెరిగిన ధరల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని రెండు రూపాయాలను తగ్గించింది. రాష్ట్రాలు కూడ వ్యాట్, సేల్స్ ట్యాక్స్‌లను కూడ తగ్గించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశాలు జారీ చేశారు.అయితే ఈ పన్నులు తగ్గిస్తే వినియోగదారులకు కొంత ఊరట లభించే అవకాశం లేకపోలేదు.

అంతర్జాతీయంగా ధరలు పెరిగే అవకాశంత

అంతర్జాతీయంగా ధరలు పెరిగే అవకాశంత

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావం వల్ల చమురు ధరలు ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు. ముడి చమురు ధరలు తగ్గిన సమయంలో ప్రభుత్వాల వ్యాట్, సేల్స్, ఎక్సైజ్ డ్యూటీలతో వినియోగదారులపై విపరీతమైన భారాన్ని మోపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
level in Delhi while petrol, kerosene and jet fuel prices continue to rise in the country in line with the surge in global crude oil prices.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి