Economic Survey: వృద్ధి బాటలోనే భారత్, ఆర్థిక సర్వే కీలక రిపోర్ట్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితుల మధ్య ఊగిసలాడుతున్న వేళ, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం స్థిరమైన వృద్ధి బాటలో ముందుకు సాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను (Economic Survey) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టగా, దేశ ఆర్థిక భవిష్యత్తుపై ఆశాజనక దృశ్యాన్ని ఈ నివేదిక ఆవిష్కరించింది. వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్ వాస్తవ జీడీపీ వృద్ధి 6.8 శాతం నుంచి 7.2 శాతం మధ్య ఉండవచ్చని సర్వే అంచనా వేసింది.

గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత్ 7.4 శాతం వాస్తవ జీడీపీ వృద్ధిని, 7.3 శాతం స్థూల విలువ జోడింపు (GVA) వృద్ధిని నమోదు చేయనున్నట్లు సూచిస్తున్నాయి. ఈ గణాంకాలు మునుపటి అంచనాలను మించిపోయినట్లుగా ఉండటంతో, భారత్ వరుసగా నాలుగో ఏడాదీ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.

Economic survey highlights India rise as global manufacturing hub with sustained growth projections

దేశీయ వినియోగం, పెట్టుబడుల బలం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా మారిందని సర్వే పేర్కొంది. అంతర్జాతీయ పరిణామాలు కొంత మేర అనిశ్చితిని కలిగిస్తున్నప్పటికీ, దేశంలో స్థూల ఆర్థిక స్థిరత్వం బలంగా ఉందని, వృద్ధి పట్ల ఉన్న ప్రమాదాల సమతుల్యత నియంత్రణలోనే ఉందని నివేదిక వివరించింది. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుని 2026-27లో ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేసింది.

ఈ సర్వేలో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్ రంగం సాధించిన పురోగతిని ప్రస్తావించింది. 2021-22లో ఏడవ అతిపెద్ద ఎగుమతి రంగంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ విభాగం, 2024-25 నాటికి మూడో అతిపెద్ద, అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎగుమతి రంగంగా అవతరించింది. 2025-26 తొలి అర్ధభాగంలోనే 22.2 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసిన ఈ రంగం, త్వరలోనే దేశంలో రెండో అతిపెద్ద ఎగుమతి విభాగంగా మారే దిశగా దూసుకెళ్తోందని ఆర్థిక సర్వే పేర్కొంది.

ముఖ్యంగా మొబైల్ తయారీ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పు ఈ వృద్ధికి ప్రధాన బలంగా నిలిచింది. 2014-15లో కేవలం రూ.18,000 కోట్లుగా ఉన్న మొబైల్ ఉత్పత్తి విలువ, 2024-25 నాటికి రూ.5.45 లక్షల కోట్లకు చేరింది. దాదాపు 30 రెట్లు పెరిగిన ఈ ఉత్పత్తి సామర్థ్యం భారత పారిశ్రామిక శక్తిని ప్రతిబింబిస్తోంది. 2014లో రెండు మొబైల్ ఫ్యాక్టరీలతో మొదలైన భారత్, నేడు 300కు పైగా కర్మాగారాలతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా మారిందని సర్వే వెల్లడించింది.

అయితే, రానున్న కాలంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చని సర్వే హెచ్చరించింది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థిక విధాన మార్పులు బాహ్య వాతావరణాన్ని అనిశ్చితంగా ఉంచుతున్నాయని పేర్కొంది. అయినప్పటికీ, అధిక నిరాశావాదం అవసరం లేదని, సంస్థలు, గృహాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తగిన సర్దుబాట్లు చేసుకుంటాయని సర్వే అభిప్రాయపడింది.

మొత్తంగా చూస్తే, దేశీయ గిరాకీ, పెట్టుబడుల పునరుత్తేజం, తయారీ రంగంలో బలపడుతున్న సామర్థ్యం భారత్‌కు స్థిరమైన వృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ప్రపంచ అనిశ్చితుల మధ్యనూ భారత ఆర్థిక వ్యవస్థ తన బలాన్ని నిరూపించుకుంటూ ముందుకు సాగుతుందన్న సందేశాన్ని ఈ నివేదిక స్పష్టంగా ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+