ATMలో ఇక ఆ నోట్లు కనిపించవా? ఆర్బీఐ క్లారిటీ..!

దేశవ్యాప్తంగా నగదు ప్రవాహాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అత్యధిక విలువ ఉన్న నోట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటి ప్రవాహంలో మార్పులు చేర్పులు చేస్తోంది. అలాగే కొత్త నోట్ల జారీ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఈ ఏడాది మార్చి నుంచి ఓ నోట్లను ఏటీఎంల నుంచి ఆర్బీఐ తొలగించబోతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇవాళ రిజర్వ్ బ్యాంక్ స్పష్టత ఇచ్చింది.

దేశంలో గతంలో మోడీ సర్కార్ చేసిన నోట్ల రద్దు తర్వాత రద్దు చేసిన 500 నోట్ల స్ధానంలో కొత్త నోట్లను తీసుకుని వచ్చారు. అయితే వీటితో పాటు అమల్లోకి తెచ్చిన 2 వేల రూపాయల నోట్లు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో 500 నోట్లను కూడా రద్దు చేసి ఏటీఎంల నుంచి ఆర్బీఐ తొలగించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆర్బీఐ క్లారిటీ ఇవ్వకపోవడంతో మార్చి నుంచి 500 నోట్లు ఏటీఎంల నుంచి మాయం కావడం ఖాయమని అంతా భావిస్తున్నారు.

Fact Check Is the RBI Stopping 500 Notes Here s the Clarification

ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఇవాళ ఎక్స్ లో ఫ్యాక్ట్ చెక్ ద్వారా 500 నోట్ల రద్దుపై స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది మార్చి కల్లా ఏటీఎంల నుంచి 500 నోట్లు తీసేస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఇందులో తేల్చిచెప్పేసింది. తాము ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదని తెలిపింది. 500 నోట్లు రద్దు కావడం లేదని, భవిష్యత్తులోనూ అవి కొనసాగుతాయని తెలిపింది. 500 నోట్ల రద్దుపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, ఎప్పుడైనా అధికారిక హ్యాండిల్స్ ద్వారా ఇచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఆర్బీఐ కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+