వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018లో బడ్జెట్: ‘పెట్రో’ ఎక్సైజ్ భారం తగ్గించండి. చమురు గోల ఆర్థికశాఖకు పడుతుందా?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చేనెల ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖను పెట్రోలియం మంత్రిత్వశాఖ అభ్యర్థించింది. ఈ ఏడాది ప్రధాని నరేంద్రమోదీ కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. దక్షిణాసియా దేశాల్లోకెల్లా భారతదేశంలోనే అత్యధికంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఉన్నాయి. వీటిల్లో పన్ను భారమే సుమారు 40 - 50 శాతం ఉంటుందని అంచనా.

లీటర్ పెట్రోల్ ధర రూ.72.23 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.63.01గా ఉన్నది. దేశీయ రిఫైన్డ్ ఇంధన వినియోగంలో పెట్రోల్, డీజిల్ వాటా సగం ఉంటుంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం భారం తగ్గించాలని తాము సిఫారసు మాత్రమే చేశామని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఆర్థిక శాఖేనని ముడి చమురుశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

Fuel Prices on Fire, Oil Ministry Seeks Cut in Excise Duty on Petrol, Diesel in Budget

చమురుశాఖ అభ్యర్థనను ఆర్థికశాఖ పరిగణనలోకి తీసుకుంటుందా?
చమురు శాఖ అభ్యర్థన మేరకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తుందా? లేదా? అన్న విషయం తేలాలంటే వచ్చేనెల ఒకటో తేదీ వరకూ వేచి చూడాల్సిందే. అసలే గతేడాది జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి తేవడంతో ద్రవ్యలోటు పెరిగిపోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పన్ను రూపేణా వచ్చే ఆదాయానికి, ఖర్చులకు మధ్య అంతరాయం మరింత పెరుగుతుందని అంచాన. 2016 - 17లో పెట్రోలియం శాఖ నుంచి రూ.5.2 లక్షల కోట్ల ఆదాయం లభించిందని గణాంకాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంతో పోలిస్తే ఇది మొత్తం ప్రభుత్వ ఆదాయంలో మూడో వంతు.

2014 నుంచి తొమ్మిది సార్లు ఎక్సైజ్ సుంకం పెంపు
ఇక 2014 నవంబర్ నుంచి 2016 జనవరి వరకు పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదిసార్లు పెంచింది. అంతర్జాతీయంగా పెట్రోలియం ఉత్పత్తి ధరలు తగ్గుముఖం పట్టినా.. జాతీయ స్థాయిలో ఆదాయాన్ని అలాగే పెంచుకునే లక్ష్యంతో తొమ్మిది సార్లు ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం.. గతేడాది అక్టోబర్ రెండో తేదీన మాత్రం లీటర్ పై రూ.2 తగ్గించింది. ఒకవేళ జీఎస్టీలోకి పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, సహజ వాయువు చేరిస్తే కేంద్ర చమురు సంస్థలకు మేలు జరుగుతుంది.

Fuel Prices on Fire, Oil Ministry Seeks Cut in Excise Duty on Petrol, Diesel in Budget

జీఎస్టీలో చేరిస్తేనే చమురు సంస్థలకు ఇలా మేలు
రిఫైండ్ ఆయిల్ సరఫరా చేసేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు సదరు కేంద్ర ముడి చమురు సంస్థలు టాక్స్ క్రెడిట్ ఉన్నదని ప్రకటించుకోవచ్చు. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆర్థిక విభాగం అధిపతి జే రామస్వామి మాట్లాడుతూ తాము త్రైమాసికంలో 1500 కోట్లు నష్టపోతున్న వేళ.. 70 శాతం ఆదాయంపై ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ కోసం క్లయిం చేయలేమని చెప్పారు. జీఎస్టీలో చేర్చిన తర్వాత 28 శాతం పన్ను వసూలు చేసినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడతాయని చమురు మంత్రిత్వశాఖ అంచనా వేస్తున్నది.

ఈశాన్య ఇంధన పైపులైన్ నిర్మాణానికి కేంద్రం చేయూతనివ్వాల్సిందే
ఇక ఈశాన్య భారత రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్, సహజ వాయువు పైపులైన్లను నిర్మించేందుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చమురు మంత్రిత్వశాఖ కోరుతోంది. ఇండియా ఆయిల్ కార్పొరేషన్ అధికారులు స్పందిస్తూ ఈశాన్యంలో 650 కిలోమీటర్ల పొడవునా ఇంధన పైపులైన్ నిర్మాణానికి సుమారు రూ.1300 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఈశాన్య భారతంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం తక్కువగా ఉండటంతో ఆర్థికంగా ఈ ప్రాజెక్టు తమకు లాభదాయకం కాదని పెట్రోలియం సంస్థలు వాదిస్తున్నాయి. భారతదేశంలో ఆర్థిక లావాదేవీలన్నీ పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలపైనే ఆధార పడి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోనే మెరుగైన మౌలిక వసతులతోపాటు తేలిగ్గా ఇంధనం సరఫరా చేసేందుకు అవసరమైన వసతులు సిద్ధంగా ఉన్నాయి మరి.

English summary
New Delhi/Mumbai: Oil ministry is pushing for a cut in excise duty on petrol and diesel in the upcoming 2018-19 budget to cushion the impact of rising oil prices on its vast consumer base, two oil ministry officials told Reuters.Prime Minister Narendra Modi, who faces elections in key states later this year, and a nationwide election in mid-2019, has faced pressure over a rise in retail prices of petrol and diesel to a record level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X