పసిడి ధరల్లో మరో భారీ పతనం: ఇక ఆగకపోవచ్చు.. !!
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం భారత్లో బంగారం, వెండి ధరలపై తీవ్రంగా పడింది. ఈ ఉదయం ట్రేడింగ్ సెషన్లో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా క్షీణించాయి. అమెరికా, ఇరాన్ల మధ్య వివాదాలు కొలిక్కి రాకపోవడం మరింత ఆజ్యం పోసినట్టయింది. క్రూడాయిల్ ధరలు పెరగడం, వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఫెడరల్ రిజర్వ్పై ఒత్తిడి నెలకొనడం వంటి పరిణామాలు పసిడి పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
సోమవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,370 రూపాయల మేర తగ్గింది. 22 క్యారెట్లు రూ. 1,250, 18 క్యారెట్లు రూ. 1,030 మేర క్షీణతను నమోదు చేసింది. ఫలితంగా మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ 5 నాటి బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.1,46,513 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ 4 నాటి వెండి ఫ్యూచర్స్ స్వల్పంగా 0.02 శాతం తగ్గి కేజీ రూ. 2,27,390 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,47,520 గా ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,35,227 వద్ద ఉంది. ఇక్కడ కేజీ వెండి ధర రూ. 2,26,190 వద్ద స్థిరపడింది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,360, 22 క్యారెట్లు రూ.1,35,080, వెండి కిలో రూ. 2,26,050 వద్ద ట్రేడ్ అయింది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 1,47,250 కాగా 22 క్యారెట్లు రూ.1,34,979, వెండి కిలో రూ.2,25,870 గా నమోదైంది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,47,710, రూ.1,35,401, రూ.2,26,490 పలుకుతున్నాయి.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,908, 22 క్యారెట్లు - రూ. 13,665, 18 క్యారెట్లు - రూ. 11,435
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,880, 22 క్యారెట్లు- రూ. 13,640, 18 క్యారెట్లు - రూ. 11,160
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,880, 22 క్యారెట్లు- రూ. 13,640, 18 క్యారెట్లు - రూ. 11,160
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,880, 22 క్యారెట్లు- రూ. 13,640, 18 క్యారెట్లు - రూ. 11,160
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,880, 22 క్యారెట్లు- రూ. 13,640, 18 క్యారెట్లు - రూ. 11,160
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,880, 22 క్యారెట్లు- రూ. 13,640, 18 క్యారెట్లు - రూ. 11,160

Click it and Unblock the Notifications