బంగారం ధరల్లో షార్ప్ డౌన్ ఫాల్

నిన్నటి వరకు దేశీయ మార్కెట్‌లో పుంజుకుంటూ వచ్చిన బంగారం ధరలు.. నేడు యూటర్న్ తీసుకున్నాయి. భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, అమెరికన్ డాలర్ మారకపు విలువ, సెంట్రల్ బ్యాంకుల విధానాలు బంగారం ధరల కదలికలను ప్రభావితం చేస్తోన్నాయి. వరుసగా నాలుగు రోజల అప్ ట్రెండ్ కు బ్రేక్ పడింది. ఇక మున్ముందు ఇదే ధోరణి కొనసాగుతుందనే అంచనాలకు తెర తీసింది.

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో గురువారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ. 1,690 మేర తగ్గుదల నమోదైంది. 22 క్యారెట్లల్లో రూ. 1,550, 18 క్యారెట్లల్లో రూ. 1,270 మేరకు తగ్గాయి. డిసెంబర్ 4న ముగియాల్సిన గోల్డ్ ఫ్యూచర్స్ లో 0.30, వెండి కాంట్రాక్ట్స్ లో 0.27 శాతం మేర తగ్గాయి. మొత్తంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,260 వద్దకు చేరింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,400 కి తగ్గింది. 18 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర 1,06,670 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold and Silver Rates in India at MCX trading 24K 22K and 18K Sharp dropped nearly 0 40 Percent

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,260 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,30,400 కొనసాగుతోంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,42,220 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. 1,30,240 ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,42,360, రూ. 1,30,420 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,42,190, 22 క్యారెట్లు రూ. 1,30,150 వద్ద కొనసాగుతున్నాయి.

రిమార్కబల్ రషీద్ ఖాన్- మొదటి బౌలర్ అతనే
రిమార్కబల్ రషీద్ ఖాన్- మొదటి బౌలర్ అతనే

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,226, 22 క్యారెట్లు - రూ. 13,040, 18 క్యారెట్లు - రూ. 10,669

ముంబై..

24 క్యారెట్లు- రూ. 14,226, 22 క్యారెట్లు - రూ. 13,055, 18 క్యారెట్లు - రూ. 10,684

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 14,226, 22 క్యారెట్లు - రూ. 13,055, 18 క్యారెట్లు - రూ. 10,684

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 14,226, 22 క్యారెట్లు - రూ. 13,055, 18 క్యారెట్లు - రూ. 10,684

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 14,226, 22 క్యారెట్లు - రూ. 13,055, 18 క్యారెట్లు - రూ. 10,684

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 14,226, 22 క్యారెట్లు - రూ. 13,055, 18 క్యారెట్లు - రూ. 10,684

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+