బంగారం కొనే ధైర్యం ఎవరికైనా ఉందా? భారీగా పెరిగిన గోల్డ్

బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. గత మూడు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టి ఊరటనిచ్చిన పసిడి ధరలు.. ఒక్కసారిగా మళ్లీ పైకి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణం. పశ్చిమాసియాలో (Middle East) ఉద్రిక్తతలు సద్దుమణగకపోవడంతో పాటు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ చేసిన తాజా ప్రసంగం బులియన్ మార్కెట్‌కు పెద్ద బూస్ట్‌లా పనిచేసింది. వడ్డీ రేట్ల పెంపుపై సాగుతున్న ఊహాగానాలకు ఆయన వ్యాఖ్యలు బ్రేక్ వేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకోగా, భారత మార్కెట్లో మాత్రం ఈ రోజు పసిడి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (జూలై 2) నమోదైన సరికొత్త రికార్డు స్థాయి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

Gold And Silver Rates Today Prices Skyrocket Globally Silver Reaches Massive Record Of Rs 2 50 000 Per KG

పెరిగిన ధరలు: గ్రాముల్లో చూస్తే..

దేశవ్యాప్తంగా నేడు గ్రాముల వారీగా చూస్తే చుక్కలు కనిపిస్తున్నాయి.

  • 24 క్యారట్లు (ప్యూర్ గోల్డ్): గ్రాము ధర రూ.377 పెరిగి ప్రస్తుతం రూ.14,455 వద్ద ట్రేడ్ అవుతోంది. (100 గ్రాముల ధర రూ.14,45,500).
  • 22 క్యారట్లు (ఆభరణాల బంగారం): గ్రాము ధర రూ.345 పెరిగి రూ.13,250 పలుకుతోంది. (100 గ్రాముల ధర రూ.13,25,000).
  • 18 క్యారట్లు: గ్రాము ధర రూ.282 పెరిగి రూ.10,841 గా నమోదైంది.

అలాగే వెండి ధర కూడా ఊహించని రీతిలో భారీగా పెరిగింది. దేశంలో నేడు గ్రాము వెండి ధర రూ. 250 పలుకుతుండగా, కిలో వెండి ధర ఏకంగా రూ. 2,50,000 మార్కును తాకింది.

30 ఏళ్ల మిస్టరీ.. మంచు కొండల్లో 'బంగారు నిధి'
30 ఏళ్ల మిస్టరీ.. మంచు కొండల్లో 'బంగారు నిధి'

తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు (10 గ్రాములకు)

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ధరలు ఒకే రకంగా స్థిరంగా భారీ పెరుగుదలను నమోదు చేశాయి.

  • హైదరాబాద్: 24 క్యారట్ల బంగారం: రూ.3,770 మేర పెరిగి రూ.1,44,550 వద్దకు చేరింది.
  • విజయవాడ: 22 క్యారట్ల బంగారం: రూ.3,450 పెరిగి రూ.1,32,500 వద్ద విక్రయించబడుతోంది.
  • విశాఖపట్నం: 18 క్యారట్ల బంగారం: రూ.2,820 పెరిగి రూ.1,08,410 గా నమోదైంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ధరలు (10 గ్రాములకు)

  • ఢిల్లీ, అహ్మదాబాద్: 24 క్యారట్లు రూ.1,44,600గా ఉండగా.. 22 క్యారట్లు రూ.1,32,550, 18 క్యారట్లు రూ.1,08,460 వద్ద ట్రేడ్ అవుతోంది.
  • ముంబై, బెంగళూరు, కోల్‌కతా: 24 క్యారట్లు రూ.1,44,550, 22 క్యారట్లు రూ.1,32,500, 18 క్యారట్లు రూ.1,08,410 గా ఉన్నాయి.
  • చెన్నై: తమిళనాడు రాజధానిలో 24 క్యారట్లు రూ.1,44,560, 22 క్యారట్లు రూ.1,32,510, 18 క్యారట్లు రూ.1,10,710 పలుకుతోంది.
Silver: ఒక్కరోజే ఏకంగా 10 వేలు పతనం! పసిడి రేట్లు ఎలా ఉన్నాయి
Silver: ఒక్కరోజే ఏకంగా 10 వేలు పతనం! పసిడి రేట్లు ఎలా ఉన్నాయి

ధరలు ఒక్కసారిగా ఊహించని రేంజ్‌కు పెరగడంతో అటు సామాన్య కొనుగోలుదారులు అయోమయంలో పడగా, ఇటు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు సైతం పసిడిపై పెట్టుబడులు పెట్టేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+