పండగ వేళ.. పసిడి ధరల్లో షార్ప్ క్రాష్- భారీ గిరాకీ.. !!
విజయదశమి పండుగ వేళ దేశీయంగా బంగారం కొనుగోలుదారులకు శుభవార్త అందింది. దసరా పర్వదినం నాడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు పతనం అయ్యాయి. పండుగ రోజున కొత్త ఆభరణాలు, నాణేలు కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు ఈ ధరల తగ్గుదల ఓ మంచి అవకాశంగా మారింది. ఈ పరిణామాలతో రిటైల్ జ్యువెలరీ షోరూమ్‌లలో పండుగ శోభను మరింత పెంచింది. కొనుగోళ్లు ఊపందుకుంటోన్నాయి.
సోమవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై రూ. 870 తగ్గింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధరలో రూ. 800, 18 క్యారెట్లల్లో రూ. 650 మేర తగ్గుదల కనిపించింది. కొనుగోలుదారులకు కొంత ఊరట కల్పించింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,34,900 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 1,47,170 వద్ద స్థిరపడింది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,200గా నమోదైంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,48,050 వద్ద ట్రేడ్ అయింది. దేశీయంగా బంగారం ధరలు తగ్గినా అంతర్జాతీయంగా మాత్రం పసిడి లాభాల బాటలోనే కొనసాగింది గ్లోబల్ స్పాట్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,145 డాలర్ల వద్ద స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతోంది. వెండి ధర కూడా ఔన్సుకు 57.5 డాలర్లకు చేరువైంది.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,717, 22 క్యారెట్లు - రూ. 13,490, 18 క్యారెట్లు - రూ. 11,091
ముంబై..
24 క్యారెట్లు- రూ. 14,717, 22 క్యారెట్లు - రూ. 13,490, 18 క్యారెట్లు - రూ. 11,038
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 14,717, 22 క్యారెట్లు - రూ. 13,490, 18 క్యారెట్లు - రూ. 11,038
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 14,717, 22 క్యారెట్లు - రూ. 13,490, 18 క్యారెట్లు - రూ. 11,038
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 14,717, 22 క్యారెట్లు - రూ. 13,490, 18 క్యారెట్లు - రూ. 11,038
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 14,717, 22 క్యారెట్లు - రూ. 13,490, 18 క్యారెట్లు - రూ. 11,038












Click it and Unblock the Notifications
