బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఒక్క రోజులోనే రూ.5 వేలు

వారం చివర్లో కాస్త శాంతించిన బంగారం ధరలు, కొత్త వారంలో తిరిగి తమ పరుగును మొదలుపెట్టాయి. కానీ ఈసారి పసిడి కంటే కూడా 'వెండి' పెను సంచలనం సృష్టిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే కేజీ వెండి ధర ఏకంగా రూ.5 వేలు పెరగడంతో, మధ్యతరగతి ప్రజలు నిశ్చేష్టులయ్యారు. కనీసం ఇకపై వెండి కూడా కొనలేమేమోనని ఆందోళన చెందుతున్నారు.

ఈ రోజు సోమవారం మార్కెట్ను పరిశీలిస్తే, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు నిన్నటి కంటే రూ.32 పెరిగింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నెల్లూరు, కడపలలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,540 వద్ద కొనసాగుతోంది.

Gold Rates in October 13th 2025

ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర కూడా అదే నగరాల్లో రూ.11,495 వద్ద స్థిరపడింది.

కానీ ఈరోజు అసలు షాక్ ఇచ్చింది మాత్రం వెండి. ఒక్క రోజులోనే కేజీ వెండి ధర ఏకంగా రూ.5 వేలు పెరిగి, లక్షా 95 వేల వద్ద చెమటలు పట్టిస్తోంది. ఈ స్థాయిలో వెండి ధర పెరగడం మధ్యతరగతి కొనుగోలుదారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ధరల పరిస్థితి:
దేశ రాజధాని నుంచి ఆర్థిక కేంద్రాల వరకు బంగారం ధరలు స్వల్పంగా మారాయి.

24 క్యారెట్ల బంగారం: చెన్నైలో అత్యధికంగా రూ.12,573గా ఉండగా, ముంబై, కలకత్తా, బెంగళూరు, కేరళలో తెలుగు రాష్ట్రాల మాదిరే రూ.12,540 వద్ద ఉంది. దిల్లీలో ఇది రూ.12,555 వద్ద ఉంది.

22 క్యారెట్ల బంగారం: చెన్నైలో రూ.11,525గా ఉంటే, దిల్లీలో రూ.11,510గా ఉంది. మిగతా మెట్రో నగరాలైన ముంబై, కలకత్తా, బెంగళూరు, కేరళలలో ఇది రూ.11,495 వద్ద ఉంది.

మొత్తం మీద, ఈ వారం బంగారం ధర స్వల్పంగా పెరిగినా, వెండి ధర మాత్రం కొనుగోలుదారులకు నిజంగానే 'చెమటలు పట్టిస్తోంది'. వివాహాలు, శుభకార్యాల సీజన్ ఉన్న నేపథ్యంలో, ధరలు స్థిరంగా ఉంటాయా లేదా మరింత పెరుగుతాయా అని మధ్యతరగతి వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+