కేంద్రం ఊరట: జీఎస్టీ 28% శ్లాబ్‌లో మిగిలింది ఇక 35 వస్తువులే

ఢిల్లీ: 28వ జీఎస్టీ కౌన్సెల్ పలు వస్తువులను తక్కువ శ్లాబ్‌లోకి తీసుకు రావడంతో ఇక 28 శాతం శ్లాబ్‌లో కేవలం 35 వస్తువులు మాత్రమే ఉన్నాయి. గత ఏడాది జూలై 1 నుంచి ఇప్పటి వరకు 28 శాతం శ్లాబ్‌లో నుంచి 191 వస్తువులను జీఎస్టీ మండలి తొలగించింది.

దీంతో అత్యధిక 28 శాతం శ్లాబ్‌లో కేవలం 35 వస్తువులు మాత్రమే ఉన్నాయని అధికారులు తెలిపారు. అందులో ఏసీలు, డిజిటల్‌ కెమెరాలు, వీడియో రికార్డర్లు, వంట పాత్రలను తోమే మెషీన్లు, ఆటో మొబైల్స్‌ వంటివి ఉన్నాయి. జులై 2017న జీఎస్టీ ప్రారంభించినప్పుడు 226 వస్తువులు 28 శాతం పన్ను శ్లాబులో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 35కు చేరింది.

GST Council Meet: Now, Only 35 Goods In 28% Bracket

ఇటీవల నిత్యం వినియోగించే 88 వస్తువులపై జీఎస్టీ తగ్గిన విషయం తెలిసిందే. చాలా వస్తువులను 28 శాతం శ్లాబ్ నుంచి 18 శాతం శ్లాబ్‌లోకి తెచ్చారు. మధ్య తరగతికి మేలు చేసేలా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి 27వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+