తల్లి రాసిన వీలునామా చెల్లదు? రూల్స్ ఇవే..

ఉమ్మడి కుటుంబ ఆస్తుల విభజన అంటేనే అనేక చిక్కుముడులు, మరెన్నో సందేహాలు. ముఖ్యంగా కుటుంబ పెద్ద (కర్త) మరణించిన తర్వాత ఆ ఆస్తిలో ఎవరికి ఎంత వాటా వస్తుంది? అసలు ఆడబిడ్డలకు హక్కు ఉందా? తల్లి తన వాటాను వీలునామా రాయవచ్చా? ఇలాంటి కీలక ప్రశ్నలకు 'ఆస్క్ వాలెట్ వైజ్' వేదికగా ప్రముఖ ఆర్థిక నిపుణులు బల్వంత్ జైన్ సమాధానమిచ్చారు.

చాలామందికి ఉండే ఒక పెద్ద సందేహం 'తల్లికి HUF ఆస్తిలో వాటా ఉంటుందా?' అని. హిందూ వారసత్వ చట్టం ప్రకారం, తల్లి కుటుంబ సభ్యురాలు మాత్రమే తప్ప 'సహభాగస్వామి' (Coparcener) కాదు. ఆస్తి విభజన కోరే హక్కు ఆమెకు ఉండదు. ఒకవేళ ఆమె బతికి ఉన్నప్పుడు ఆస్తి పంపిణీ జరిగితే, కుమారులతో సమానంగా ఒక వాటా ఆమెకు అందుతుంది. కానీ, ఆమెకు ఆస్తిలో ముందే నిర్దిష్ట వాటా ఉండదు కాబట్టి, ఆమె తన వాటాగా భావించిన ఆస్తిని వేరొకరికి వీలునామా రాయడం చట్టపరంగా చెల్లదు.

HUF Property Division Rules Can a Mother Will Her Share Expert Insights on Inheritance After Father s Death
ఆస్తి హక్కుల్లో కొత్త ట్విస్ట్! కూతురు vs భార్య.. ఎవరికి పవర్ ఎక్కువ?
ఆస్తి హక్కుల్లో కొత్త ట్విస్ట్! కూతురు vs భార్య.. ఎవరికి పవర్ ఎక్కువ?

తండ్రి వాటా ఎలా విడిపోతుంది?

హిందూ వారసత్వ చట్టం 1956 సవరణ తర్వాత నిబంధనలు మారాయి. ఒక సహభాగస్వామి మరణిస్తే, అతని వాటా 'డీమ్డ్ విభజన' ద్వారా వేరు చేయబడుతుంది. ఉదాహరణకు, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే, ఆ HUF ఆస్తిలో తండ్రి వాటా 1/3వ వంతు ఉంటుంది. ఆయన వీలునామా రాయకుండా మరణిస్తే, ఆ 1/3వ వంతు ఆస్తి ఆయన చట్టపరమైన వారసులకు (ఇద్దరు కొడుకులకు) సమానంగా అందుతుంది. అంటే అది అప్పటి నుండి వారి వ్యక్తిగత ఆస్తిగా మారుతుంది.

వీలునామా రాయకుండా చనిపోతే ఆస్తి ఎవరికి దక్కుతుంది?
వీలునామా రాయకుండా చనిపోతే ఆస్తి ఎవరికి దక్కుతుంది?

కుమారులకు, కుమార్తెలకు ఎంత వాటా?

HUF ఆస్తుల్లో ఎవరికీ ముందే 'ఇంత వాటా' అని కచ్చితంగా ఉండదు, అది విభజన జరిగినప్పుడే తేలుతుంది. ఒకవేళ ఇప్పుడు ఆస్తి పంపిణీ జరిగితే, మిగిలిన 2/3వ వంతు ఆస్తిని ఇద్దరు సోదరులు సమానంగా పంచుకోవాలి. ఇందులో భాగంగా పెద్ద కుమారుడికి వచ్చే వాటాలో ఆయనకు, ఆయన కుమారుడికి మరియు ఆయన కుమార్తెకు ఒక్కొక్కరికి 1/9వ వంతు చొప్పున వాటా లభిస్తుంది.

Note: హిందూ చట్టాల్లో వారసత్వ అంశాలపై గతంలో భిన్నమైన తీర్పులు వచ్చినందున, ఇలాంటి విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఇది కేవలం నిపుణుల అభిప్రాయం మాత్రమే, ఈ సమాచారాన్ని వన్ ఇండియా ద్రవీకరించడం లేదు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+