23 ఏళ్ల తర్వాత తొలిసారి.. ట్రంప్ ప్రభావమా?
America-India: గత 2 దశాబ్ధాలుగా అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య నిరంతరం పెరుగుతూ వచ్చింది. అయితే 2025లో ఈ ధోరణిలో గణనీయమైన మార్పు కనిపించింది. 2001 తర్వాత తొలిసారిగా అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానాలు, వీసా సమస్యలేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ తగ్గుదల ముఖ్యంగా విద్యార్థులు, వృత్తి నిపుణుల ప్రయాణాలపై ఎక్కువ ప్రభావం చూపింది.
తగ్గుతున్న ఆసక్తి
అమెరికా వాణిజ్య శాఖ నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. జూన్ 2025లో కేవలం 2.1 లక్షల మంది భారతీయులు మాత్రమే అమెరికాకు వెళ్లారు. ఇది జూన్ 2024లో నమోదైన 2.3 లక్షల కంటే 8 శాతం తక్కువ. ఇదే ధోరణి జులైలో కూడా కొనసాగింది. ఇందులో 5.5 శాతం తగ్గుదల నమోదైంది. గత 23 ఏళ్లలో కొవిడ్-19 మహమ్మారి సమయంలో మినహా.. ఇలాంటి తగ్గుదల ఎప్పుడూ నమోదు కాలేదు. ఇది అమెరికాకు భారత్ అతిపెద్ద ట్రావెల్ మార్కెట్లలో ఒకటిగా ఉన్నప్పటికీ.. భారతీయులలో అమెరికా పట్ల ఆసక్తి తగ్గుతోందని సూచిస్తోంది.

పర్యాటక రంగంపై ప్రభావం
సాధారణంగా అమెరికాకు వెళ్లే భారతీయులు ఎక్కువగా పర్యాటక కోసం కాకుండా.. విద్య, ఉద్యోగం లేదా కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించడం విశేషం. వీసా జారీ ప్రక్రియలో జాప్యం, కఠిన నిబంధనల కారణంగా విద్యార్థులు అమెరికాకు వెళ్లడానికి వెనుకాడుతున్నారు. ఈ సమస్యలు కొనసాగితే వ్యాపారం కోసం, బంధువులను కలవడానికి వెళ్లే వారి సంఖ్య కూడా భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంది. అమెరికాలో 50 లక్షల మందికి పైగా భారతీయుల బలమైన సమాజం ఉంది. దీని వల్ల రెండు దేశాల మధ్య రాకపోకలు నిరంతరంగా ఉంటాయి. అయినప్పటికీ ఈ ఏడాది జూన్‌లో ప్రయాణీకుల సంఖ్యలో తగ్గుదల గత రెండు దశాబ్దాల పెరుగుదలకు బ్రేక్ వేసింది.
అమెరికాకు బదులుగా ఈ దేశాలకు..
అగ్రరాజ్యమైన అమెరికాకు ప్రయాణాల సంఖ్య తగ్గినప్పటికీ భారతీయుల విదేశీ ప్రయాణాలు మాత్రం తగ్గలేదు. ఏప్రిల్ 2025లో 29 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్లారు. భారతీయులు అమెరికాకు బదులుగా భారతీయులు ఎక్కువగా యూఏఈ, సౌదీ అరేబియా, థాయ్‌లాండ్. సింగపూర్ వంటి దేశాలకు వెళ్తున్నారు. ఇది విదేశీ ప్రయాణాల పట్ల భారతీయుల ఆసక్తి తగ్గలేదని, కేవలం వారు గమ్యస్థానాలను మారుస్తున్నారని సూచిస్తోంది.
పర్యాటకం ప్రాముఖ్యతపై నిపుణుల అభిప్రాయాలు
నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ పర్యాటక రంగం ప్రాముఖ్యత గురించి చెప్పారు. భారతీయ ఉత్పత్తులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించి నేపథ్యంలో.. పర్యాటకం సుంకాల ప్రభావం లేని రంగమని, ఇది భారతదేశానికి అతిపెద్ద ఎగుమతి ఆదాయ వనరుగా మారే సామర్థ్యం ఉందని ఆయన అన్నారు. ఇండియాలో అపారమైన సహజ సౌందర్యం, చారిత్రక, సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పటికీ, ప్రపంచ పర్యాటకుల రాకలో మన వాటా కేవలం 1.5 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. ఈ సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు.
ఈ పరిణామాలు భారత్, అమెరికా మధ్య సంబంధాలలో వచ్చిన మార్పులను సూచిస్తున్నాయి. ట్రంప్ పాలనలో భారత్ ను లక్ష్యంగా చేసుకున్న విధానాలు భారతీయులలో అమెరికా పట్ల ఉన్న ఆసక్తిని తగ్గించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణి భవిష్యత్తులో ఇరుదేశాల ఆర్థిక, పర్యాటక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
-
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications