అలా మొదలైన రూపాయి ప్రయాణం.. నేటి ట్రేడింగ్ రేంజ్ ఇదే!

అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నప్పటికీ భారత కరెన్సీ రూపాయి బుధవారం ఉదయం స్వల్ప పుంజుకుంది. ఆసియా వ్యాప్తంగా ఇతర దేశాల కరెన్సీలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న తరుణంలో, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు పుంజుకుని ట్రేడింగ్‌ను సానుకూలంగా ప్రారంభించింది.

సోమవారం నాటి ట్రేడింగ్ ముగింపు సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.12 వద్ద ఉండగా, బుధవారం ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే 9 పైసలు లాభపడి 95.03 స్థాయికి చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాబోయే కాలంలో వడ్డీ రేట్ల పెంపుపై తీసుకోబోయే నిర్ణయాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో మన రూపాయి సానుకూల ధోరణి కనబరచడం విశేషం.

Indian Rupee Opens Higher By 9 Paise At 95 03 Per Dollar Amid Mixed Asian Currency Trends Today
ఇలా అయితే రూపాయి గతి ఏంటి? వణికిపోతున్న కరెన్సీ మార్కెట్లు..
ఇలా అయితే రూపాయి గతి ఏంటి? వణికిపోతున్న కరెన్సీ మార్కెట్లు..

విదేశీ మార్కెట్లలో క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు కరెన్సీ ట్రేడింగ్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఒకానొక దశలో బ్యారెల్ ముడిచమురు ధర 113.32 డాలర్లకు దిగివచ్చినప్పటికీ, సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులు , అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా మళ్లీ 115.90 డాలర్లకు ఎగబాకింది. విదేశీ మారక నిపుణుల అంచనా ప్రకారం.. ఇవాళ్టి ట్రేడింగ్‌లో రూపాయి విలువ 95.00 నుంచి 95.25 శ్రేణి మధ్యలోనే కొనసాగే అవకాశముంది. దిగుమతిదారులు రూపాయి తగ్గినప్పుడు కొనుగోళ్లు జరపగా, ఎగుమతిదారులు లభించే అవకాశాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

రూపాయికి షాక్.. తిరగబడిన డాలర్
రూపాయికి షాక్.. తిరగబడిన డాలర్

అంతర్జాతీయంగా ఆసియా ఖండంలోని వివిధ దేశాల కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే భిన్నమైన ధోరణిని ప్రదర్శించాయి. దక్షిణ కొరియా 'వాన్' అత్యధికంగా 0.369 శాతం నష్టపోగా, ఇండోనేషియా 'రూపియా', థాయిలాండ్ 'బాట్', సింగపూర్ 'డాలర్'లు కూడా కొంతమేర బలహీనపడ్డాయి. మరోవైపు, తైవాన్ 'డాలర్' 0.222 శాతం, ఫిలిప్పీన్స్ 'పెసో' 0.101 శాతం మేర లాభపడ్డాయి. మలేషియా 'రింగ్గిట్', జపాన్ 'యెన్', చైనా 'యువాన్'లు కూడా స్వల్ప లాభాలతో గడిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+