Stock Market: దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ ప్రకటనతో సెన్సెక్స్ 1300 పాయింట్లు ఆఫ్!

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈరోజు ఒక మైలురాయిగా నిలిచిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లపై ఊహించని విధంగా 90 రోజుల పాటు విరామం ప్రకటించడంతో మదుపుదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ అనూహ్య ప్రకటనతో వాణిజ్య యుద్ధ మేఘాలు తొలగిపోయి, కొనుగోలుదారుల ఉత్సాహం వెల్లువెత్తింది. అన్ని రంగాల షేర్లు కొనుగోళ్ల వర్షంలో తడిసి ముద్దయ్యాయి. ఫలితంగా ప్రధాన సూచికలు రికార్డు స్థాయిలో లాభాలను మూటగట్టుకున్నాయి.

దూసుకెళ్లిన సెన్సెక్స్..
సెన్సెక్స్ ఏకంగా 1300 పాయింట్లు ఎగిసి 75,157.26 వద్ద స్థిరపడగా, నిఫ్టీ సైతం 429.40 పాయింట్లు లాభపడి 22,828.55 వద్ద ముగిసింది. ఈ ఒక్కరోజు ర్యాలీతో మదుపుదారుల సంపద ఊహించని రీతిలో పెరిగింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)లో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ. 7.72 లక్షల కోట్లు పెరిగి, రూ. 401.54 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది మదుపుదారులకు నిజమైన పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

indian-stock-market-hits-highs-sensex-crosses-75-157-points

ఆసియాలోని ఇతర మార్కెట్లు మిశ్రమ సంకేతాలను చూపించాయి. జపాన్ మార్కెట్లు నష్టాలను చవిచూడగా, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు లాభాలతో ముగియడం విశేషం. భారతీయ మార్కెట్లు మాత్రం ఈ ప్రాంతీయ ధోరణిని ధిక్కరించి, తమదైన ముద్ర వేసుకున్నాయి.

ట్రంప్ ప్రకటనతో జోష్
ట్రంప్ విరామం ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ ర్యాలీ జరగాల్సి ఉన్నప్పటికీ, మహావీర్ జయంతి కారణంగా నిన్న మార్కెట్లకు సెలవు. దీంతో, అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, భారతీయ సూచికలు ఈ ఉదయం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్ల లాభంతో 74,835.49 వద్ద ప్రారంభమైంది, ఇంట్రాడేలో 75,467.33 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది.

లాభాలతో ముగిసిన స్టాక్స్
సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ , రిలయన్స్ వంటి బ్లూ-చిప్ స్టాక్‌లు అద్భుతమైన పనితీరును కనబరిచాయి. ఫార్మా మరియు మెటల్ స్టాక్‌లు ప్రత్యేకించి దూకుడుగా రాణించాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ (4 శాతం), నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ (3 శాతం)తో పాటు నిఫ్టీ ఆటో, హెల్త్‌కేర్, ఫైనాన్షియల్, ఐటీ వంటి అన్ని రంగాల షేర్లు రాణించడం మార్కెట్లకు మరింత ఊపునిచ్చింది.

అటు అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 63.65 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఔన్సు బంగారం ధర 3248 డాలర్లకు చేరుకుంది. భారత్‌తో సహా 75 దేశాలపై విధించిన టారిఫ్‌లను 90 రోజుల పాటు నిలుపుదల చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం భారత మార్కెట్లకు ఊరటనిచ్చింది. వాణిజ్య యుద్ధ భయాలు తొలగిపోవడంతో మార్కెట్లకు కొత్త ఉత్సాహం వచ్చింది. అటు డాలర్ విలువ క్షీణించడం కూడా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు సానుకూలంగా మారింది. డాలర్ ఇండెక్స్ తాజాగా 100 దిగువకు చేరింది.

డాలర్ బలహీనత: డాలర్ విలువ క్షీణించడం కూడా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు సానుకూలంగా మారింది. డాలర్ ఇండెక్స్ తాజాగా 100 దిగువకు చేరింది. రంగాల వారీగా కొనుగోళ్లు: నిఫ్టీ మెటల్ ఇండెక్స్ (4 శాతం), నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ (3 శాతం)తో పాటు నిఫ్టీ ఆటో, హెల్త్‌కేర్, ఫైనాన్షియల్, ఐటీ వంటి అన్ని రంగాల షేర్లు రాణించడం మార్కెట్లకు మరింత ఊపునిచ్చింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దిగుమతులపై ఆధారపడే మన దేశానికి ఇది చాలా సానుకూల అంశమని నిపుణులు చెబుతున్నారు . ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+