మాపై పెట్టే శ్రద్ధ.. కాస్తయినా వీళ్లపై పెట్టండి: టైగర్ ష్రాఫ్ కాల్పులపై అభిజిత్ దిప్కే

బాలీవుడ్ పై మరోసారి మాఫియా పంజా విసిరే ప్రయత్నం చేసింది. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం సాయంత్రం ఓ ఫుట్‌బాల్ క్లబ్ నుంచి ఆయన బయటకు వస్తున్న సమయంలో అయిదు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ వార్త బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

తుపాకీ కాల్పుల వల్ల ఎగిరిపడిన గాజు పెంకులు, గన్‌పౌడర్ శకలాలు గుచ్చుకోవడంతో టైగర్ ష్రాఫ్ చేయి, భుజం, ఛాతీ పైభాగంలో గాయాలయ్యాయి. ఆయన కారు డ్రైవర్‌ ఫిర్దౌస్ కు నేరుగా బుల్లెట్లు తగిలింది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. డ్రైవర్ పరిస్థితి నిలకడగా ఉంది.

Instead of cracking down students and activists police should focus on actual criminals says Dipke

ఈ ఘటనపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఘాటుగా స్పందించారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టుల ఉదంతాలను ప్రస్తావించారు. ప్రభుత్వం, పోలీసుల ప్రాధాన్యతలు పూర్తిగా దారితప్పాయని విమర్శించారు. విద్యార్థులు, సామాజిక కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవడం మానేసి, ముంబైలో అరాచకాలు సృష్టిస్తోన్న నేరస్థులపై పోలీసులు దృష్టి సారించాలని హితవు పలికారు.

టైగర్ ష్రాఫ్ కరేజ్..: తానే కారు డ్రైవ్ చేస్తూ డ్రైవర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాడు
టైగర్ ష్రాఫ్ కరేజ్..: తానే కారు డ్రైవ్ చేస్తూ డ్రైవర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాడు

నగరంలో కళ్ల ముందు జరుగుతున్న నేరాలను అరికట్టడం వదిలేసి, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సామాజిక కార్యకర్తలను నిర్బంధించడంలోనే పోలీసులు ఎక్కువగా నిమగ్నమయ్యారని దిప్కే విమర్శించారు. నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంపై చూపుతున్న శ్రద్ధ.. బహిరంగంగా కాల్పులకు తెగబడుతున్న నేరస్తులను పట్టుకోవడంపై పెట్టాలని అన్నారు. పోలీసు బలగాలను ప్రజాస్వామ్య నిరసనలను అణచివేయడానికి ఉపయోగించడం కంటే, పౌరుల కోసం భద్రత కోసం వినియోగించడం మంచిదని అన్నారు.

పసిడి ధరలకు పండగ కొనుగోళ్ల ఊతం- అప్ ట్రెండ్
పసిడి ధరలకు పండగ కొనుగోళ్ల ఊతం- అప్ ట్రెండ్

మరోవంక.. ఈ దాడికి తామే బాధ్యులమని అనిల్ పండిత్, హర్మన్ సంధూ అనే వ్యక్తుల పేర్లతో ఉన్న సోషల్ మీడియా పోస్ట్ ప్రత్యక్షం కావడం ప్రాధాన్యతను సంతరిచుకుంది. నటుడు సల్మాన్ ఖాన్‌తో సత్సంబంధాలు కలిగి ఉండటం, ఆయనతో కలిసి సినిమాలు చేయడమే ఈ దాడికి కారణమని పేర్కొన్నారు. సల్మాన్‌తో కలిసి పనిచేసే ఇతర సినీ ప్రముఖులను కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+