టైగర్ ష్రాఫ్ కరేజ్..: తానే కారు డ్రైవ్ చేస్తూ డ్రైవర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాడు
బాలీవుడ్ పై మరోసారి మాఫియా పంజా విసిరే ప్రయత్నం చేసింది. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం సాయంత్రం ఓ ఫుట్‌బాల్ క్లబ్ నుంచి ఆయన బయటకు వస్తున్న సమయంలో అయిదు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ వార్త బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
తుపాకీ కాల్పుల వల్ల ఎగిరిపడిన గాజు పెంకులు, గన్‌పౌడర్ శకలాలు గుచ్చుకోవడంతో టైగర్ ష్రాఫ్ చేయి, భుజం, ఛాతీ పైభాగంలో గాయాలయ్యాయి. ఆయన కారు డ్రైవర్ ఫిర్దౌస్ కు నేరుగా బుల్లెట్లు తగిలింది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. డ్రైవర్ పరిస్థితి నిలకడగా ఉంది.

టైగర్ ష్రాఫ్ వాహనంపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరుపుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఫుట్ బాల్ క్లబ్ నుంచి తన కారులో టైగర్ ష్రాఫ్ బయటికి వస్తోన్న సమయంలో అక్కడున్న వాళ్లు మొబైల్ ఫోన్ లో వీడియో చిత్రీకరిస్తోండగా ఇది రికార్డయింది. ఎంహెచ్ 2 జీఈ 0264 లగ్జూరియస్ ఆడి కారులో గేటు దాటి బయటికి వచ్చిన వెంటనే తెల్లటి షర్టులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బుల్లెట్ల వర్షాన్ని కురిపించడం ఈ వీడియోలో చూడొచ్చు.
ఈ కాల్పుల్లో గాయపడ్డ డ్రైవర్ ఫిర్దౌస్ ను టైగర్ ష్రాఫ్ స్వయంగా ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. కారును డ్రైవ్ చేయలేని స్థితిలో ఉన్న అతన్ని ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టి తాను స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లాడు. కాల్పులకు ఏ మాత్రం భయపడలేదతను. అక్కడి నుంచి పారిపోలేదు. అలాగని పోలీసులు వచ్చేంత వరకూ ఎదురు చూడలేదు. ప్రమాద తీవ్రతను గమనించిన టైగర్ ష్రాఫ్.. ఏమాత్రం ఆలస్యం చేయలేదు. సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. తానే స్వయంగా కారును డ్రైవ్ చేస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
Tiger Shroff driver got critically injured in firing he suffered 2 shots 😨- Tiger instantly took the driver seat and took him to Nanavati hospital. https://t.co/66fWTOWrZt
— Jeet (@JeetN25) October 18, 2026
ఈ కాల్పుల్లో ఫిర్దోస్ ఎడమ చేతికి బుల్లెట్ తగిలింది. తీవ్ర రక్తస్రావమైంది. టైగర్ ష్రాఫ్.. డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటున్నప్పుడు అక్కడ రక్తపు మరకలు కూడా కనిపించాయి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారును విల్లేపార్లేలోని నానావతి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డ్రైవర్ ను అడ్మిట్ చేయించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టైగర్ ష్రాఫ్ ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచింది.












Click it and Unblock the Notifications
