టీడీపీ కంచుకోటల్లో వైసీపీ అభ్యర్థులు- ఆచితూచి ఎంపిక
ఏపీలో వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల మూడో విడత జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వివిధ సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తోంది.
ఇప్పటికే రెండు విడతల్లో వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించిందా పార్టీ. ఇప్పుడు తాజాగా మూడో విడత జాబితా విడుదలైంది. రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.. వైఎస్ఆర్సీపీ. స్థానికంగా ప్రజలతో మమేకమై పనిచేసే అనుభవం, ప్రజాదరణ కలిగిన నాయకులకే ఈ అవకాశాలు కల్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీ కంచుకోటలుగా భావించే కుప్పం, పలమనేరు, ఆదోని, మండపేట, పెద్దాపురం.. వంటివి ఇందులో ఉన్నాయి.

మున్సిపాలిటీలు ఇవే..
పెద్దాపురం- కాపుగంటి సౌందర్య లక్ష్మి (దేవాంగ)
సామర్లకోట- ఉబా జాన్ మోసెస్ (మాల)
మండపేట- డాక్టర్ కాట్రావత్ రాము (ఎస్టీ- లంబాడి)
జంగారెడ్డి గూడెం- మేకా సత్యవతి (గౌడ)
నిడదవోలు- వేదల విజయలక్ష్మి (మాల)
ఆదోని- గాజుల ప్రణీత రెడ్డి (రెడ్డి)
గుత్తి- మాతంగి అంజుల (మాదిగ)
కుప్పం- విజయ్ కుమార్ (మాల)
పలమనేరు- వీ శ్రీలక్ష్మి (కమ్మ)
పుత్తూరు- జయ ప్రకాష్ (ఈడిగ)
గుంతకల్లు- ఎన్ వెంకట లక్ష్మి (బోయ)
పార్వతీపురం- సాయి శ్రీ పట్నాన (వైశ్య)












Click it and Unblock the Notifications
